బీహార్ రాజధాని పాట్నాలో జెన్ జీ మూమెంట్‌తో హై టెన్షన్ నెలకొంది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ప్రిలిమినరీ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలతో వేలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు వీధుల్లోకి వచ్చి భారీ నిరసన చేపట్టారు. పేపర్ లీక్ అయిన పరీక్షలను రద్దు చేసి.. విచారణ జరిపి మళ్లీ కొత్తగా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.

Also Read : ఆలయంలో రచ్చ రచ్చ: మహిళా ఎస్సైని చెంపదెబ్బ కొట్టిన BJP MLA కూతురు..

ఈ నిరసనల క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా పోలీసులను మోహరించారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థులు భద్రత కోసం ఏర్పాటు చేసిన పోలీసు బారికేడ్లను పెద్ద పెద్ద దుంగలు, తోపుడు రాళ్లతో కూల్చి వేశారు. పోలీసులు అధికారులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఇద్దరి మధ్య ఆందోళనలు తీవ్ర మయ్యాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Also Read : నెలకు రూ.10 వేలతో కోటి రూపాయలు.. ఎలాగో మీకు తెలుసా?