Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఈ సరికొత్త డిజిటల్ ఉద్యమానికి దారితీశాయి. ఈ డిజిటల్ తిరుగుబాటుకు సోషల్ మీడియాలో యువతీ, యువకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌కు గురువారం నాటికి 10.5 మిలియన్స్ (కోటి 50 లక్షలు) ఫాలోవర్స్ వచ్చారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ యువతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు లేని యువకులు బొద్దింకల్లాగా తయారవుతున్నారని, వీళ్లందరూ RTI కార్యకర్తలుగా మారి వ్యవస్థలను విమర్శిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
Also Read: అభినయ్ దర్శన్ ‘హత్యాయత్నం’ డ్రామా వెనుక కుట్ర కోణం..మత విద్వేషాల కోసమే పక్కా స్కెచ్
ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, ఆర్థిక ఇబ్బందులతో అసంతృప్తితో ఉన్న యువతకు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. వ్యవస్థ తమను బొద్దింకలుగా చూస్తే, ఆ బొద్దింకలన్నీ కలిసి ఏకమైతే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ 30 ఏళ్ల పబ్లిక్ రిలేషన్స్ విద్యార్థి, మాజీ పొలిటికల్ సోషల్ మీడియా వాలంటీర్ అభిజీత్ దిప్కే బరిలోకి దిగారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కాన్వా (Canva) డిజైన్ల సాయంతో రాత్రికి రాత్రే ఆయన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) అనే వ్యంగ్య రాజకీయ పార్టీని స్థాపించారు. సోషల్ మీడియాలో ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: కుప్పంలో తాటి ముంజలు తిన్న చంద్రబాబు.. అవి తింటే ఎన్నిలాభాలతో తెలుసా?
తమను తాము ‘సోమరులు, నిరుద్యోగుల గొంతుక’గా ప్రకటించుకున్న ఈ కాక్‌రోచ్ జనతా పార్టీ.. తమ సిద్ధాంతాన్ని ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ (సోమరి)’ అని పిలుచుకుంటోంది. అంతేకాదు ఈ పార్టీ ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ కూడా ఏర్పాటు చేసుకుంది. ఇందులో పార్టీలో సభ్యత్వం పొందేందుకు కూడా కొన్ని అర్హతలు పెట్టారు. ఇందులో చేరేవారు నిరుద్యోగి అయి ఉండాలి. బద్ధకం ఉండాలి. 24 గంటలు ఆన్‌లైన్‌లో ఉంటూ విమర్శలు చేయాలి.
Also Read: ప్రమాదాల వెనుక కుట్ర కోణం…రైల్వేశాఖ సంచలన విషయాలు!
ఈ పార్టీ అయిదు పాయింట్లతో మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. రిటైర్ అయిన ఏ సీజేఐకి కూడా రాజ్యసభ సీటు ఉండదు. ఓట్లు అక్రమంగా డిలీట్ చేస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేయడం. అంబానీ, అదానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయడం. అలాగే పార్లమెంటు, క్యాబినెట్‌లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుంది. మొత్తానికి ఈ పార్టీకి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.










