Sowcar Janaki :  ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (95) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, నిన్న రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు వెంటనే ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

1931 డిసెంబర్ 12న జన్మించిన ఆమె.. 1950లో వచ్చిన షావుకారు చిత్రంతో సినీ రంగప్రవేశం చేసిన జానకి.. తన అద్భుత నటనతో షావుకారు జానకిగా గుర్తింపు పొందారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. నాటకరంగం, సినిమాతో సహా పలు రంగాలలో ఆమె అందించిన కళా సేవలకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2022లో ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.