
Colombia : భారీ భూకంపం కారణంగా అతలాకుతలమైన కొలంబియా దేశాన్ని ఆదుకోవాలని ఆ దేశ నూతన అధ్యక్షుడు అబెర్డో డె లా ఎస్పిరియెల్లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరారు. కొలంబియా ఉత్పత్తులపై ప్రస్తుతం విధించిన భారీ దిగుమతి సుంకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇటీవల సంభవించిన పెను భూకంపం వల్ల కొలంబియా వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్ష్ట సమయంలో వారికి కొంత ఉపశమనం కలిగించడానికి సుంకాల తాత్కాలిక సడలింపు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఈ విషయాలను వెల్లడించారు.
Also Read : వైట్‌హౌస్‌కు కూతవేటు దూరంలో చైనా స్నైపర్: అమెరికాలో కలకలం!
ఇదిలా ఉండగా, జూలై చివరి నాటికి కొలంబియా ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకం 10 శాతం నుండి 12.5 శాతానికి పెరిగింది. అయితే కాఫీ, చమురు వంటి కొన్ని మినహాయింపులు మినహా మిగతావాటిపై ఈ పెంపు వర్తిస్తోందని సమాచారం. భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన తమ దేశ వ్యాపారులను ఆదుకునే దిశగా అమెరికా సానుకూలంగా స్పందిస్తుందని కొలంబియా ప్రభుత్వం ఆశిస్తోంది.
కాగా ఇటీవలే కొలంబియాలో పశ్చిమ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో ఈ పెను భూకంపం సంభవించింది. దీని కేంద్రభాగం చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పాల్మార్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా దేశంలో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం సుమారు 294 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 3,900 మందికి పైగా గాయపడ్డారు. అలాగే వేలాది ఇళ్లు, వాణిజ్య భవనాలు నేలమట్టమయ్యాయి.
Also Read : అమెరికా సైనికుడిని చంపితే ముప్పై వేల డాలర్లు.. ఇరాన్ సంచలన ప్రకటన!









