BIG BREAKING : పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. రాంపూర్‌హాట్‌లోని తన నివాసానికి సమీపంలో ఉన్న టీఎంసీ పార్టీ కార్యాలయంలో ఆశిష్ బెనర్జీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

పార్టీ ఆఫీసు నుంచి ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతికి గల పూర్తి కారణాలు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగిందనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆశిష్ బెనర్జీ రాంపూర్‌హాట్ నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన 2001 నుండి 2026 వరకు వరుసగా 25 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బెనర్జీ బీజేపీ అభ్యర్థి ధ్రుబ సాహా చేతిలో ఓడిపోయారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.