టాలీవుడ్ టాప్ హీరో, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటుండగా.. సినీరాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ హ్యాపీ బర్త్ డే తారక్ అంటూ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి, నారా కుటుంబాల సమీకరణాల నేపథ్యంలో లోకేష్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Heartfelt birthday wishes to @tarak9999. May God bless you with good health and success.
— Lokesh Nara (@naralokesh) May 20, 2026
ఇక ఈ బర్త్‌డే విషెస్ అన్నింటిలోకి మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొడాలి నాని పెట్టిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్‌లో పెను సంచలనం సృష్టిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కొడాలి నాని అత్యంత ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “నాకు అత్యంత ఆప్తుడు, నా తమ్ముడు అయిన నందమూరి తారకరామరావు (తారక్)కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
నా తమ్ముడు..
జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు 💐@tarak9999#HappyBirthdayNTR #HBDNTR #NTR pic.twitter.com/DLB9uyBwi1— Kodali Nani (@IamKodaliNani) May 19, 2026
అత్యంత సన్నిహిత సంబంధాలు
గతంలో ఎన్టీఆర్, హరికృష్ణ హయాం నుండి కొడాలి నానికి తారక్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలు ఎలా ఉన్నా, తారక్‌ను నా తమ్ముడు అంటూ కొడాలి నాని సంబోధించడం నందమూరి అభిమానులను, రాజకీయ విశ్లేషకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥— Allu Arjun (@alluarjun) May 20, 2026
రాజకీయ నాయకులతో పాటు సినీ ఇండస్ట్రీ నుండి కూడా తారక్‌పై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటుగా పలువురు సెలబ్రేటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.










