
HCU : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి విక్రయిస్తున్న ఒక పూర్వ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 10 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : నిజామాబాద్‌లో విషాదం : తీర్చలేని అప్పులతో తనువు చాలించిన దంపతులు!
పక్కా ముందస్తు సమాచారంతో ఈగల్ టీమ్ అధికారులు యూనివర్సిటీ ప్రాంగణంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలువురు విద్యార్థుల వద్ద గంజాయి లభించింది. దీంతో అనుమానితులైన విద్యార్థులకు డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 17 మంది విద్యార్థులు గంజాయి సేవించినట్లుగా నిర్ధారణ అయింది.
పట్టుబడిన డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ గంజాయి విక్రయాలు అస్సాం రాష్ట్రం నుంచి సాగుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీని వెనుక ఉన్న నెట్వర్క్ ను రాబట్టేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Also Read : రాపిడో డ్రైవర్‌ను అంటూ యువతికి బురిడీ…. ఆమె ఇచ్చిన షాక్‌కు పరార్..









