China rocket explosion : చైనా అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా ప్రయోగించిన ఒక రాకెట్‌ ప్రయోగించిన 85 సెకన్లలోనే పేలిపోవడంతో చైనా అంతరిక్ష కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. హైనాన్‌ ప్రావిన్స్‌లోని వెంచాంగ్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-7ఏ రాకెట్ ను ప్రయోగించారు. అయితే కొద్దిసేపటికే గాల్లో పేలిపోయింది. రాకెట్‌ పేలిపోవడంతో కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టాలనుకున్న ప్రయత్నం విఫలమైంది.

చైనా సమయం ప్రకారం ఆగస్టు 10వ తేదీ రాత్రి 8:02 గంటలకు లాంగ్ మార్చ్-7ఏ పేరుతో ఉన్న రాకెట్‌ వెంచాంగ్‌ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ప్రయోగించిన సుమారు 85 సెకన్ల తర్వాత రాకెట్‌లో అంతరాయం ఏర్పడింది. అది అసాధారణ స్థితికి చేరుకుని గాల్లోనే విడిపోయి పేలిపోయింది. రాకెట్‌పేలి అగ్నిగోళంగా మారిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి.

ఈ ప్రయోగంలో శాట్-4బీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని చైనా పెట్టుకున్న లక్ష్యం నెరవేరలేదు. జోంగ్‌షింగ్‌-4బీ అని కూడా పిలిచే రాకెట్‌ వైఫల్యంతో ఉపగ్రహం కక్ష్యలోకి చేరలేకపోయింది. రాకెట్‌ ఎందుకు పేలిపోయిందనే దానిపై ప్రస్తుతం చైనా నుంచి స్పష్టమైన సమాచారం లేదు. ఈ వైఫల్యానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.