
Toxic Trailer: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్ ట్రైలర్ బెంగళూరులో జరిగిన వేడుకలో విడుదలంది. ఈ ట్రైలర్‌లో యశ్ ఊహించని విలక్షణమైన, రఫ్ అండ్ రూత్‌లెస్ అవతారంలో కనిపించి అభిమానులకు మైండ్ బ్లాక్ చేశారు.
ట్రైలర్ చూస్తుంటే ఇది కేవలం మామూలు గ్యాంగ్‌స్టర్ డ్రామా మాత్రమే కాకుండా.. నేరం, అధికారం, మోసం, ప్రేమల చుట్టూ తిరిగే ఒక డార్క్ అండ్ మైండ్ బెండింగ్ డ్రామాగా అనిపిస్తోంది. గోవా నేపధ్యంలో నడిచే ఈ కథలో యశ్ రాయా,రూమీ అనే డబుల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కెజియఫ్ విజయాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వస్తున్న యశ్, తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ , యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ ట్రైలర్‌లో విశ్వరూపం చూపించాడు.
ఈ చిత్రంలో నయనతార (గంగ), కియారా అడ్వాణీ (నాదియా), హ్యూమా ఖురేషీ (ఎలిజబెత్), తారా సుతారియా (రెబెక్కా), రుక్మిణి వసంత్ (మెలిస్సా) వంటి అగ్ర కథానాయికలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతీ ఒక్కరి పాత్ర సినిమాలో బాగా డిజైన్ చేశారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ , యశ్ సొంత బ్యానర్ మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా భాషల్లో ఈ సినిమాను ఆగస్టు 26వ తేదీన అత్యంత ఘనంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.









