Khammam Teacher : ఖమ్మం జిల్లాలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న భూక్యా గౌతమి ఉదంతం కలకలం రేపుతోంది. గతంలో క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెప్పే బాధ్యతను పక్కనపెట్టి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం, ప్రైవేటు సంస్థల ప్రమోషన్లలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఆమె సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ వ్యవహారంలో ఒక పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. టీచర్ గౌతమి తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తనకు ఎదురైన చేదు అనుభవాలను, రాజీనామాకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఒక భావోద్వేగ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read : ఈ ఏడాది భారీ అగ్నిప్రమాదాలు.. అందరూ పోతారు : భవిష్యవాణిలో సంచలనం..

ఈ వ్యవస్థలో గత 12 ఏళ్లుగా ఎంతో అంకితభావంతో పనిచేసి నిరుపేద పిల్లలకు విద్యనందించానని గౌతమి గుర్తుచేసుకున్నారు. ఎన్ని ఒత్తిడులు ఉన్నా పోరాటం చేసి పుస్తకాలు విరాళంగా ఇచ్చానని, ట్యూబ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వేలాది మంది పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించి, వారిని సర్కారీ బడుల్లో చేర్పించానని చెప్పారు. కానీ ఈ రోజు నిజాయితీగా కష్టపడే ఒక ఉపాధ్యాయురాలు ఓడిపోయిందని వాపోయారు. తెలియక చేసిన చిన్న తప్పుకు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్స్, సమాజంలో అవహేళనలు, చీదరింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు.

Also Read : తెలంగాణ పోలీసు శాఖలో భారీ నోటిఫికేషన్: 7,437 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

పాఠశాలలో కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులకు తగిన స్థానం లభించడం లేదని, తోటి ఉపాధ్యాయుల కుట్రలు, పన్నాగాలు, పొలిటిక్స్ నడిపేవారికే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. పిల్లల కోసం తాను చేసిన కష్టమే తనకొక శాపంగా మారిందని ఆవేదన చెందారు. తానెంతో నమ్మి తీసుకున్న ఈ రాజీనామా నిర్ణయం తనను భవిష్యత్తులో ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నానని, ప్రజలందరూ తనకు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రస్తుతం గౌతమి షేర్ చేసిన ఈ భావోద్వేగ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండటంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.