Rashmika Mandanna : టాప్ హీరోయిన్ రష్మిక మందన్నకు తీవ్ర గాయమైంది. ఒక డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా చిత్రాల షూటింగ్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు. ఈ సినిమాల కోసం వరుసగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, కఠినమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు చేయాల్సి రావడంతో ఆమె శరీరానికి తీవ్ర ఒత్తిడి గురైంది. ఈ క్రమంలోనే ఆమెకు హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్‌మెంట్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రష్మిక రాబోయే 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆమె కోలుకుని తిరిగి షూటింగ్స్‌లోకి రావాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

Also Read : ఏకంగా సాయిపల్లవినే డ్యామినెట్ చేసింది… ఎవరి బ్యూటీ?

Also Read : ‘శ్రీనివాస మంగాపురం’ రివ్యూ.. సూపర్ స్టార్ మనవడు హిట్ కొట్టాడా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.