మేషం
మొదలుపెట్టిన పనిని పట్టుదలతో పూర్తి చేయండి. ఆర్థికంగా, సామాజికంగా మంచి గౌరవం లభిస్తుంది. శివదర్శనం మంచిది.

వృషభం
వ్యాపారంలో లాభాలు ఉంటాయి, చేతికి డబ్బు అందుతుంది. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. సూర్య ధ్యానం శుభప్రదం.

మిథునం
దైవబలం బాగుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ముందుచూపుతో ఉండండి. ధైర్యంగా అడుగులు వేస్తే మంచి లాభాలు వస్తాయి.

కర్కాటకం
ఈరోజు ఫలితాలు సాధారణంగా ఉంటాయి. అనుభవజ్ఞుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవడం అవసరం.

సింహం
కొంచెం కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో పనులను అప్పటికప్పుడే పూర్తి చేయండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విష్ణు దర్శనం ఉత్తమం. – Zodiac Signs

కన్య
గ్రహబలం చాలా బాగుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

Also Read : ఆరోగ్యానికి మంచిదని ఉదయాన్నే వీటిని తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్లే!

తుల
ఉద్యోగులకు అనుకూలమైన సమయం. పనుల్లో పురోగతి ఉంటుంది. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించండి. శని శ్లోకం చదవడం మంచిది.

వృశ్చికం
ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. పెద్దల మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విష్ణు ఆరాధన మేలు చేస్తుంది.

ధనుస్సు
ఉద్యోగంలో పనులను వాయిదా వేయకండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కొందరు రెచ్చగొట్టేలా ప్రవర్తించినా వివేకంతో వ్యవహరించండి.

మకరం
గురుబలం వల్ల పనులు సులువుగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఒక శుభవార్త సంతోషాన్ని నింపుతుంది. లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.

కుంభం
ఉద్యోగంలో పైఅధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపార పనులు వేగంగా సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి కాబట్టి పొదుపు ముఖ్యం.

మీనం
కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సమయాన్ని వృథా చేయకుండా పట్టుదలతో పనులు పూర్తి చేయండి. శ్రీరాముడిని దర్శించుకుంటే మరింత మేలు జరుగుతుంది.

Also Read : తమిళనాడులో సంచలనం.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!