Khamenei Funeral : ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం, ఆయన అంత్యక్రియల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం భారత్ పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ దుఃఖ సమయంలో భారత ప్రభుత్వం ప్రజలు ఇరాన్‌కు అండగా నిలవడం, భారతీయ ప్రతినిధి బృందం అంత్యక్రియలకు హాజరవ్వడంపై ఇరాన్ ఎంబసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ అడుగు ఇరు దేశాల మధ్య ఉన్న దశాబ్దాల చారిత్రక మైత్రికి, మానవీయ సంబంధాలకు నిదర్శనమని ఇరాన్ అభివర్ణించింది.

Also Read : అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం..టెహ్రాన్‌లో హోరెత్తిన ప్రతీకార జ్వాలలు

సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశం

ఈ మేరకు ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా వేదిక ‘X’ (గతంలో ట్విట్టర్) లో ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్ చేసింది. “భారత ప్రభుత్వం, అక్కడి ప్రజలు, అంత్యక్రియల్లో పాల్గొన్న అధికారిక భారత ప్రతినిధి బృందానికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా అమర నేత ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీకి నివాళులర్పించేందుకు భారతీయ నాయకులు , వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు తరలిరావడం అనేది పరస్పర గౌరవానికి ప్రతీక. స్నేహం, దయతో భారత్ చూపిన ఈ చొరవను ఇరాన్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు” అని పేర్కొంది.

భారత్ నుంచి హాజరైన ఉన్నత స్థాయి ప్రతినిధులు

ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమానికి భారత్ తరపున ఒక బలమైన,సర్వపక్ష ప్రతినిధి బృందం టెహ్రాన్ చేరుకుంది. భారత ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ అధికారికంగా భారత్ ప్రాతినిధ్యాన్ని వహించారు. వీరు కాకుండా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ-కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా టెహ్రాన్ వెళ్ళి ఖమేనీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. “ఈ కష్టకాలంలో ఇరాన్ ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాము. ఇరాన్ ప్రభుత్వం అందించిన ఆతిథ్యం పట్ల కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.

Also Read : ‘చైనా ఏజెంట్’గా పాక్.. అమెరికా సంచలన నివేదిక.. షాకింగ్ విషయాలు!

కొత్త వారసుడిగా మొజ్తబా ఖమేనీ

ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పశ్చిమ ఆసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆరు రోజుల పాటు జరిగిన ఆయన అంత్యక్రియల ప్రక్రియలో భాగంగా టెహ్రాన్ వీధులు లక్షలాది మంది ప్రజలతో కిటకిటలాడాయి. ఖమేనీ మరణానంతరం, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించారు. అయితే, ఇజ్రాయెల్ నుంచి వస్తున్న నిరంతర దాడుల ముప్పు, భద్రతా కారణాల దృష్ట్యా మొజ్తబా తన తండ్రి అంత్యక్రియల కార్యక్రమాలకు దూరంగా ఉండాలని భద్రతా ఏజెన్సీలు సూచించాయి.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.