
MIM MLA : హైడ్రా అధికారుల కూల్చివేతల వ్యవహారంపై MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫాతిమా కాలేజీ, తమ విద్యాసంస్థలను కూల్చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాము అస్సలు భయపడబోమని స్పష్టం చేశారు. తమ విద్యాసంస్థలను కూల్చేస్తామంటూ కొందరు మాట్లాడుతున్నారు. కానీ మా సంస్థలను ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసునన్నారు. ఇలాంటి బెదిరింపులు తమకేం కొత్త కాదన్నారు.
Also Read : అనర్హులకు తెలంగాణ సర్కార్ షాక్…లక్ష ఫించన్లకు చెక్ ?
గతంలో చాలానే చూశాం. మీ బెదిరింపులకు మేం ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడం, లొంగిపోమని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్న మా విద్యాసంస్థలను ఒకవేళ మీరు కూల్చేస్తే.. మేము ఊరుకోము, ఒకదానికి బదులు వంద విద్యాసంస్థలను కట్టి చూపిస్తాం. మా విద్యాసంస్థలు ఉన్నా, లేకపోయినా విద్యార్థులకు చదువు చెప్పించే బాధ్యతను మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం అని వెల్లడించారు. మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ఎవరినీ మోసం చేయలేదు.
మమ్మల్ని మానసికంగా భయపెట్టాలని చూస్తున్నారు కానీ అది ఎవరి వల్లా కాదన్నారు అక్బరుద్దీన్ ఒవైసీ. హైడ్రా పేరుతో కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, చట్టబద్ధంగా, నిజాయితీగా నడుస్తున్న తమ సంస్థల జోలికి వస్తే సహించేది లేదని అక్బరుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.
Also Read : నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీసు కొలువుల జాతర









