
Aamir Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మళ్లీ పెళ్లి పీటలెక్కారు. తన లాంగ్ టైమ్ గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రట్‌ను ఆయన అధికారికంగా వివాహం చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న అమీర్ ఖాన్ సొంత నివాసంలో వీరిద్దరి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తమిత్రుల సమక్షంలో ఈ వేడుక చాలా నిశ్శబ్దంగా సాగింది.
శనివారం మధ్యాహ్నం దాదాపు 12:45 గంటల సమయంలో అమీర్ ఖాన్ (61), గౌరీ స్ప్రట్ (47) పెళ్లి పత్రాలపై సంతకాలు చేసి తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయంలో వీరిద్దరూ ఎంతో సంతోషంగా, కాస్త ఎమోషనల్‌గా కనిపించారని పెళ్లికి వచ్చిన వారు చెప్పారు. ఈ ప్రైవేట్ వేడుకకు దాదాపు 150 మంది అతిథులు హాజరయ్యారు. వీరిలో అమీర్ ఖాన్ పిల్లలు జునైద్, ఇరా, ఆజాద్‌లతో పాటు గౌరీ కొడుకు కూడా ఉన్నారు. కొంతమంది బంధువులు విదేశాల నుండి కూడా ఈ పెళ్లి కోసం ముంబై వచ్చారు.
Also Read : నేను బైసెక్సువల్.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్!
తమ మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ జంట ప్రపంచానికి చెప్పింది. తమకు ఒకరినొకరు దాదాపు 25 ఏళ్లుగా తెలుసని, కానీ రెండేళ్ల క్రితమే ఇద్దరి మధ్య డేటింగ్ మొదలైందని అమీర్ ఖాన్ గతంలోనే వెల్లడించారు. అమీర్ ఖాన్‌కు ఇది మూడో పెళ్లి. ఆయనకు మొదట రీనా దత్తాతో పెళ్లయింది, వీరికి జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వీరు 2021లో విడాకులు తీసుకున్నారు. వీరి కొడుకు పేరు ఆజాద్.
ఇక అమీర్ ఖాన్‌ను పెళ్లాడిన గౌరీ స్ప్రట్ స్వస్థలం బెంగళూరు. ఆమె మీడియా వెలుగులకు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. ఆమె తల్లి రీటా స్ప్రట్ గతంలో ఒక సెలూన్ నడిపేవారు. గౌరీ బ్యూటీ, వెల్నెస్ రంగంలో పనిచేస్తున్నారు. ఆమె లండన్ యూనివర్సిటీలో స్టైలింగ్, ఫోటోగ్రఫీ కోర్సు చదివారు. ప్రస్తుతం ముంబైలో ప్రముఖ బి బ్లంట్ సెలూన్‌ను ఆమె రన్ చేస్తున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, కేవలం తమకు నచ్చిన కొద్దిమంది సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని ఈ జంట ముందే డిసైడ్ అయ్యి ఇలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు.
Also Read : బట్టల నుండి చెమట వాసన… కంపెనీ పరువు తీసిన హీరోయిన్ త్రిష!









