
అమెరికా-ఇజ్రాయెల్(America-Israel) కలిసి ఇరాన్‌పై దాడి చేయడంతో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అలీ ఖమేనీ అంత్యక్రియలను కొన్ని రోజుల నుంచి ఇరాన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఖమేనీ భౌతికకాయాన్ని ముందు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు తరలించారు. అయితే అక్కడి నుంచి ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఫిబ్రవరి 28న ఆయన ఏ ప్రదేశంలోనైతే దాడుల్లో హత్యకు గురయ్యారో నేరుగా ఆ ప్రాంతానికే భౌతికకాయాన్ని చేర్చారు. ఖమేనీ అమరత్వం పొందిన పవిత్ర స్థలానికి ఆయన పార్థివ దేహాన్ని రహస్యంగా తరలించినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.
Also Read : యూరప్‌లో 40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. ఇండియాలో 45 దాటినా చెక్కుచెదరవు.. ఎందుకో తెలుసా?
In an unannounced event, the coffin carrying the body of the martyred leader Ayatollah Khamenei was brought to the site of his martyrdom.#Revenge pic.twitter.com/ejWhaZ2Y1m
— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) July 2, 2026
టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లా సముదాయంలో శుక్రవారం ఆయనకు చివరి వీడ్కోలు పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఈ నెల 6న అధికారికంగా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత చివరకు ఈ నెల 9న ఆయన సొంత పట్టణమైన మషాద్‌లో ఖనన సంస్కారాలు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియల కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. అయితే భారత్‌లో ఇరాన్ ప్రతినిధి ఆయతుల్లా హకీం ఇలాహి భద్రతా ముప్పు వల్ల ఖమేనీ హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో మొజ్తబా బయటకు రాకపోవడం మంచిదని భావించి హాజరు కావడం లేదు. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబాను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకే వేదికపై ఇరాన్ అగ్రనేతలంతా గుమిగూడితే శత్రుదేశాలు డ్రోన్ లేదా వైమానిక దాడులు చేసే అవకాశం ఉంది. అందుకే భద్రతను దృష్టిలో ఉంచుకుని మొజ్తబా ఖమేనీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
Also Read : ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దండయాత్ర.. బాంబుల మోతతో ధ్వంసమైన కీవ్ నగరం









