bhagyaraj

తమిళ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో భాగ్యరాజ్‌ దాదాపు 75 సినిమాల్లో నటించి మెప్పించారు. నటుడిగానే కాకుండా 25 విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ప్రతిభ చాటుకున్నారు. భాగ్యరాజ్ హఠాన్మరణం పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు.

Also Read : ఇడుపు కాయితం టైటిల్‌పై రచ్చ రచ్చ.. ఏపీ vs తెలంగాణగా మారిన వివాదం!

Tami Actor-Director K Bhagyaraj Dies @73

భాగ్యరాజ్ అంటేనే అద్భుతమైన స్క్రీన్‌ప్లేకి కేరాఫ్ అడ్రస్. సాదాసీదా కథలను కూడా ఎంతో వినోదభరితంగా, కుటుంబ సమేతంగా చూసేలా తెరకెక్కించడంలో ఆయన సిద్ధహస్తుడు. కామెడీ, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామాను మిక్స్ చేసి.. చూసే ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీసేవారు. సినిమాలో హీరో అంటే అన్నీ పర్ఫెక్ట్ గా ఉండనక్కర్లేదు, కాస్త లోపాలు ఉన్నా జనం మెచ్చుకుంటారు అని నిరూపించిన నటుడు ఆయన.

1979లో సువరిల్లాద చిత్రంగళ్ సినిమాతో భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన తీసిన ఒరు కై ఓసై (1980), మౌన గీతాలు (1981), అంతా 7 నాట్కల్ (1981 – ఇది తెలుగులో రాధా కళ్యాణంగా రీమేక్ అయింది), ముంధానై ముడిచ్చు (1983 – తెలుగులో మూడు ముళ్లు), చిన్న వీడు (1985) వంటి సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. భాగ్యరాజ్ కథలు, స్క్రీన్‌ప్లేలు తెలుగులో కూడా ఎందరో స్టార్ హీరోల సినిమాలకు ఆధారంగా నిలిచాయి.

భాగ్యరాజ్ గారి భార్య పూర్ణిమా జయరామ్ కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ (తెలుగులో మగమహారాజు వంటి సినిమాల్లో నటించారు). వారికి ఇద్దరు పిల్లలు శంతను భాగ్యరాజ్, శరణ్య భాగ్యరాజ్ ఉన్నారు. శంతను ప్రస్తుతం తమిళంలో హీరోగా రాణిస్తున్నారు. భాగ్యరాజ్ మరణవార్త తెలియగానే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ఎందరో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : కాంట్రవర్సీలతోనే కాసుల వర్షం: ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ ద్వారా లక్షలు ఆర్జిస్తున్న విష్ణుప్రియ..

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.