pakistan

పాకిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4 గా నమోదైందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూమికి దాదాపు 35 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి గట్టిగా కంపించింది. ఒక్కసారిగా ఇళ్లు, ఆఫీసుల్లో వస్తువులు కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతానికి ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు సమాచారం లేదు.

Also Read : వోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులు ఔట్!

Earthquake In Pakistan

అధికారుల సమాచారం ప్రకారం.. ఈ భూకంపం వల్ల ఎటువంటి పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే, నిన్న సాయంత్రం కూడా పాకిస్తాన్‌లో 5.3 తీవ్రతతో ఇలాగే భూమి కంపించింది. బ్యాక్-టు-బ్యాక్ రెండు రోజులు భూకంపాలు రావడంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు కొంచెం ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వ అధికారులు పరిస్థితిని నిరంతరం గమనిస్తూ, ఎక్కడైనా చిన్నపాటి నష్టాలు జరిగాయా అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు.

Also Read : ట్రంప్ 100 శాతం పన్ను హెచ్చరిక.. ఇండియాపై ఎఫెక్ట్ ఎంత?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.