
తరచూ రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. వీటిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ.. ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా మరొక ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నవంబర్ 18 అంటే నిన్న.. ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్-ఉత్తరౌలా రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో రెండు బైక్లు టీవీఎస్ స్పోర్ట్, టీవీఎస్ రైడర్ ఎదురెదురుగా అత్యంత వేగంగా దూసుకొచ్చాయి. పొగమంచు కారణంగా ఒకరికొకరు కనిపించకపోవడంతో ఒకేసారి బలంగా ఢీకొట్టుకున్నాయి. ఉత్తరౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్సిబర్హరా గ్రామం సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో బలరాంపూర్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read : పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి.. 28 ఏళ్ల పోలీస్ అధికారి ఆత్మహత్య
कोहरे के चलते बलरामपुर में बड़ा हादसा: 5 दोस्तों की मौत, निकले थे चाय पीने गाड़ी ने मार दी टक्कर https://t.co/GbZrOg6TWX @balrampurpolice #balrampurnews #viral #utraula @uppolice https://t.co/UfLQJUiglH
— Bhupendra Tiwari (@Bhupend29375158) November 19, 2026
అనంతరం స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులు ముజమ్మిల్ ఖాన్, నహిద్ అలీని సమీప ఉత్తరౌలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ఆపై ప్రాణాలు కోల్పోయిన మృతులను గుర్తించారు. మృతులలో గుఫ్రాన్ (18), రెహ్మత్ (30), తౌఫిక్ (19), మహమ్మద్ ఫరూఖ్ (20), సలీం (20) ఉన్నారు.
ఐదుగురు యువకులు మరణించిన వార్త తెలుసుకున్న బలరాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మార్తాండ్ ప్రకాష్ సింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని అంచనా వేయడానికి ఆసుపత్రికి వెళ్లారు. ఈ విషయంపై దర్యాప్తు జరిపి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. పోలీసులు సంఘటనా స్థలం నుంచి దెబ్బతిన్న రెండు హెల్మెట్లతో పాటు ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : ఫోన్లో పబ్జీ ఆడే పిల్లలు.. బయట ప్రాణాలు తీస్తారా?









