లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ బుక్ లాంచ్ ఈవెంట్‌లో తన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ మెమోరీస్ గురించి ఎమోషనల్ అండ్ ఫన్నీ విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా కూడా హాజరైన ఈ కార్యక్రమంలో రాహుల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.

Also Read : నా కుటుంబంపై ఎన్నో తప్పుడు కథనాలు.. అందుకే పుస్తకం రాశా: సోనియా గాంధీ

తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు మొదటిసారి కలుసుకున్న కేంబ్రిడ్జ్‌లోని ‘వర్సిటీ రెస్టారెంట్’కు తాను వెళ్లిన సంఘటనను రాహుల్ గుర్తుచేసుకున్నారు. “చాలా ఏళ్ల తర్వాత నేను కేంబ్రిడ్జ్ వెళ్లినప్పుడు, నా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఆ రెస్టారెంట్‌కు వెళ్లాను. అక్కడి స్టాఫ్‌కు మా అమ్మానాన్నలు ఇక్కడే కలుసుకున్నారని చెప్పగానే, వాళ్లు వెంటనే గుర్తుపట్టారు. ఆ తర్వాత సిబ్బంది సలహా మేరకు రెండు ‘చికెన్ చాసర్’ ఆర్డర్ చేశాం. కానీ అక్కడ ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. మీరు ప్రేమలో పడాలనుకుంటే ఆ రెస్టారెంట్‌కు వెళ్లండి, కానీ చికెన్ చాసర్ మాత్రం అస్సలు ట్రై చేయకండి” అంటూ రాహుల్ నవ్వులు పూయించారు. అనంతరం ఆ గర్ల్‌ఫ్రెండ్ గురించి మీడియా అడగగా, “ఆమె ఇప్పుడు నా ఫ్రెండ్ మాత్రమే” అని కూల్‌గా సమాధానమిచ్చారు.

మరోవైపు, తన తల్లి ఎదుర్కొన్న కష్టాలను తలుచుకుని రాహుల్ ఎమోషనల్ అయ్యారు. సోనియా గాంధీ తన బుక్‌లో తక్కువ చేసి రాసినప్పటికీ, ఆమె ఇప్పటివరకు నాలుగు సార్లు క్యాన్సర్‌ను జయించారని రాహుల్ రివీల్ చేశారు. “నా జీవితంలో అమ్మ ఎప్పుడూ భయపడటం కానీ, వెనకడుగు వేయడం కానీ నేను చూడలేదు. నాన్న ఉండి ఉంటే నిన్ను చూసి ఎంతో గర్వపడేవారు” అని రాహుల్ అన్నారు.

1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత సెక్యూరిటీ రీజన్స్ వల్ల రాహుల్‌ను హార్వర్డ్ యూనివర్సిటీ నుండి వేరే అమెరికన్ కాలేజీకి మార్చి, వేరే పేరుతో చదివించాల్సి వచ్చిందని, ఆ సమయంలో ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారని సోనియా గాంధీ భావోద్వేగంతో వెల్లడించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మరణాల తర్వాత మౌనంగా మారిపోయిన తన తల్లికి, దేశ ప్రజల ప్రేమే మళ్లీ కొత్త జీవితాన్ని ఇచ్చిందని రాహుల్ పేర్కొన్నారు.

Also Read : యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ బిగ్ అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు రూల్స్!