
సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక పబ్లిక్ ఫిగర్స్ పర్సనల్ లైఫ్‌పై బురద చల్లడం కొందరికి అలవాటుగా మారిపోయింది. సెలబ్రిటీల జీవితంలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కీబోర్డ్ వారియర్స్ రెచ్చిపోతుంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడిపోతున్నారనే ప్రకటన రాగానే నెట్టింట నెగెటివిటీ పీక్స్‌కి చేరింది. అయితే, ఊహించని రీతిలో పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఈ ట్రోలింగ్ భూతంపై స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
Also Read : సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న స్టార్ సెలబ్రిటీలు వీళ్లే!
ఒక మనిషి ఎమోషనల్ కష్టాల్లో ఉన్నప్పుడు వారిపై పడి మరింత విమర్శలు చేయడం రాక్షసత్వమని రేణూ దేశాయ్ కుండబద్దలు కొట్టారు. “సమాజంలో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా వాళ్లు కూడా మనలాగే తోటి మనుషులు. ఎవరో ఒకరికి బిడ్డలు, పేరెంట్స్ లేదా తోబుట్టువులు అనే కనీస కామన్సెన్స్ మర్చిపోకూడదు. అప్పటికే కిందపడి బాధలో ఉన్నవారిని మరింత తొక్కేయడం నైతికంగా ఏమాత్రం కరెక్ట్ కాదు” అంటూ నెటిజన్లకు మానవత్వపు విలువను గట్టిగా గుర్తుచేశారు.
ముఖ్యంగా ఈ పోస్ట్‌లో ఆమె వాడిన ఒక ఫిలాసఫికల్ లైన్ నెట్టింట ట్రెండ్ అవుతోంది: “మనమంతా ఎన్నో లోపాలతో కూడిన గాజు ఇళ్లలో బతుకుతున్నాం, అలాంటి మనం వేరేవాళ్ల ఇళ్లపై రాళ్లు విసరడం మానుకోవాలి.”
తాను పవన్‌కు సపోర్ట్‌గా మాట్లాడితే వచ్చే రూమర్లను ముందుగానే పసిగట్టిన రేణూ, ట్రోలర్స్‌కి అదిరిపోయే సైంటిఫిక్ పంచ్ కూడా ఇచ్చారు. “నేను ఇలా స్పందిస్తున్నందుకు నాకు ఎలాంటి ‘పేటీఎం’ డబ్బులు రాలేదు. సానుభూతి, దయ అనేవి మనిషికి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్. నా బ్రెయిన్లోని ‘ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్’ సరిగ్గా పనిచేస్తోంది కాబట్టే ఒక హ్యూమన్‌గా రియాక్ట్ అయ్యాను. మీ పనికిమాలిన గాసిప్స్ మొదలుపెట్టకండి” అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.
గతాన్ని, పగను పక్కనపెట్టి తోటి మనిషి బాధను అర్థం చేసుకోవడంలో రేణూ దేశాయ్ చూపించిన ఈ మెచ్యూరిటీ నిజంగా గ్రేట్. ఎదుటివారి కష్టాన్ని చూసి ఎంజాయ్ చేసే ప్రస్తుత సమాజానికి ఆమె మెసేజ్ ఒక పెద్ద పాఠంలాంటిది.
Also Read : ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్న ‘రుద్రవనం పీఎస్’ సిరీస్.. అస్సలు మిస్ చేయొద్దు..









