ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన లైనప్‌‌లో ఉన్న మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y6kను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇది 120Hz డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఇందులో 13-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Vivo Y6k Price

Vivo Y6k ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,000గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ బ్లూ, వైట్, బ్లాక్ అనే మూడు కలర్‌లలో లభిస్తుంది. ఈ ఫోను అఫీషియల్ సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Vivo Y6k Features

Vivo Y6k స్మార్ట్‌ఫోన్ 6.74-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 1,600 x 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌, 1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇది వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్‌లో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ప్రాసెసింగ్ కోసం.. ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ అందించారు. గ్రాఫిక్స్ కోసం.. ఈ ఫోన్‌లో మాలి-G57 GPU ఉంది. కెమెరా ఫీచర్లలో 13MP వెనుక కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. Vivo Y6k ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ కోసం.. ఈ ఫోన్‌లో 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఛార్జింగ్ కోసం దీనికి ఒక USB టైప్-సి పోర్ట్ ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP65 రేటింగ్ ఉంది.