
దీపావళి పండుగ వచ్చేసింది. నవంబర్ 8న టపాసుల సౌండ్‌తో ఊరుఊరంతా మోతమోగనుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ క్రాకర్స్ కాల్చుతూ ఈ పండుగను ఎంతో సంతోషంగా చేసుకోనున్నారు. నేలపై కాల్చే టపాసులు.. గాల్లోకి వెళ్లి కాంతులు విరజిల్లుతూ అద్భుతంగా కనిపించనున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు కాల్చే టపాసులతో సందడి వాతావరణం కనిపించనుంది.
అయితే ఒక్క రాష్రంలో మాత్రం క్రాకర్స్ కాల్చితే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే భారీగా జరిమానా విధిస్తారు కూడా. ఆ రాష్ట్రం మరేదో కాదు.. మిజోరం. ఈ రాష్ట్రంలో అనుమతి లేకుండా టపాసులు కాల్చితే.. దాదాపు 6 నెలల పాటు జైలు శిక్ష విధిస్తారు.
మిజోరంలో టపాసులు కాల్చడంపై ప్రత్యేక చట్టం అమల్లోకి వచ్చింది. అదే మిజోరం ఫైర్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2026 చట్టం. దీని ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే.. రూ.లక్ష వరకు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి హెచ్చరించారు. ఈ చట్టం గురించి మంత్రి కె.సప్డాంగా తాజాగా ఐజ్వాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం.. పేలుడు సంబంధిత పదార్థాల వాడకం, స్టోరేజీ, అమ్మకాలను కంట్రోల్ చేయడమే.
చట్టం రూల్స్ ప్రకారం..
ముందుగా డిప్యూటీ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోకుండా.. పటాకులు కాల్చడం లేదా స్టోర్ చేయడం శిక్షార్హం.
అలాగే పటాకులు లేదా పేలుడు సంబంధిత పదార్థాలు అమ్మకం కోసం ముందుగా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ లేకుండా ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్, 1884 ప్రకారం అమ్మకం నిషేధం.
ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధిస్తారు.
అలాగే 12 ఏళ్లలోపు పిల్లలు ఈ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిసే.. వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు జరిమానా విధిస్తారు.
చట్టంలోని సెక్షన్ 3, 4 ఉల్లంఘిస్తే.. దాదాపు 3 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.50 వేల వరకు భారీ జరిమానా విధిస్తారు.









