
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తరచూ కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందిస్తూ తన యూజర్లను ఆకట్టుకుంటోంది. ఒక్కోసారి తక్కువ ధరలో ప్లాన్లను అందిస్తూ మరింత మందిని అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా జియో తన ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోకు కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
ఈ కొత్త ప్లాన్‌లో వినియోగదారులు 365 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో కంపెనీ 5G డేటాను కూడా అందిస్తోంది. దీనివల్ల యూజర్లు నెల నెలా రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా రెండు సిమ్‌లను ఉపయోగిస్తూ.. ఒక సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లను తీసుకోవలసి వస్తున్న వినియోగదారులకు ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్త ప్లాన్ ధర గురించి తెలుసుకుందాం.
జియో తన వినియోగదారుల కోసం కేవలం రూ.1000 ధరకే ఒక సంవత్సరం వ్యాలిడిటీని ఇచ్చే ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ కంపెనీ ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం మాత్రమే అందిస్తుంది. దీనిని కంపెనీ అధికారిక వెబ్సైట్ Jio.com, MyJio యాప్ నుండి కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక నెలవారీ ఖర్చు విషయానికి వస్తే.. నెలకు కేవలం రూ.83.33 ఖర్చు అవుతుంది. ఇది ఏడాది పొడవునా రీఛార్జ్ చేయాలనుకునే వారికి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ ప్లాన్‌తో పాటు 12 నెలల జియోషీల్డ్ యాక్సెస్ కూడా లభిస్తుంది. ఇది ఇద్దరు పిల్లలకు వర్తిస్తుంది. దీనిలో వినియోగదారు లొకేషన్ అలర్ట్, స్క్రీన్ టైమ్ కంట్రోల్, SOS అలర్ట్ వంటి ఫీచర్లను పొందుతారు. ఈ ప్లాన్‌తో పాటు 12 నెలల కాన్వా ప్రో యాక్సెస్ కూడా పొందొచ్చు. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో రూ.1000 విలువైన జియో వోచర్లను పొందుతారు. ఇందులో 10 వోచర్లు లభిస్తాయి. వీటిని సులభంగా రీడీమ్ కూడా చేసుకోవచ్చు. జియో అందిస్తున్న ఈ రూ.1000 ప్లాన్‌తో 28 రోజుల పాటు అపరిమిత 5G డేటా ప్రయోజనం లభిస్తుంది. మొత్తంగా సిమ్ డీయాక్టివేషన్ సమస్యల నుంచి దూరంగా ఉండాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా ఉంటుంది. అలాగే కేవలం రూ. 84 కంటే తక్కువ వ్యయంతోనే ఏడాది పొడవునా సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది.









