
దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ పండుగ సమయంలో కొత్త టీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన అవకాశం. స్మార్ట్‌టీవీపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్‌టీవీపై లభిస్తున్న ఆఫర్లు, డీల్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో Flipkart Big Bang Diwali Sale ప్రారంభమైంది. ఈ సేల్‌లో మీరు మీ ఇంటి కోసం పెద్ద టీవీ కొనాలని ఆలోచిస్తుంటే 65 అంగుళాల Xiaomi X Series TV స్మార్ట్‌టీవీ అందుబాటులో ఉంది. ఈ టీవీ అసలు ధర రూ.74,999 కాగా.. ఇప్పుడు 43 శాతం తగ్గింపుతో కేవలం రూ.42,499లకే సొంతం చేసుకోవచ్చు.
అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్‌ను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్ లభించి రూ.38,999లకే పొందవచ్చు. అంటే ఒక్క ఈ స్మార్ట్‌టీవీపై దాదాపు రూ.36,000 భారీ డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ టీవీ 65-అంగుళాల పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ టీవీ పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉండటం వల్ల సినిమాలు, యూట్యూబ్ వీడియోలు అద్భుతమైన క్వాలిటీతో చూసేందుకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఈ టీవీలో రెండు స్పీకర్లు ఉన్నాయి. ఒక్కోటి 30W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇది సినిమాలు చూస్తున్నప్పుడు, ఇతర వీడియోలను ప్లే చేస్తున్నప్పుడు మంచి సౌండ్ క్వాలిటీ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇది అనేక రకాల యాప్‌లు, ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫారమ్‌లకు సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ కోసం.. ఇందులో HDMI, USB పోర్ట్‌లు ఉన్నాయి. అందువల్ల ఈ సేల్‌లో కొత్త 65-అంగుళాల టీవీ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న ఈ డీల్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది.









