
న్యూజిలాండ్‌తో జరిగిన 5వ టీ20లో భారత్ ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నమన్ ధీర్ తప్ప ఇంకెవరూ పెద్దగా రన్స్ చేయలేకపోయారు. ఇషాన్ 32 బంతుల్లో 61 పరుగులు, శ్రేయస్ 23 బంతుల్లో 50 పరుగులు, నమన్ 33 పరుగులు చేశారు.
అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొదటి నుంచే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది. ఇలా వికెట్లు పడకుండా మంచి ఆరంబం అందించింది. మొత్తంగా 18 ఓవర్లు ముగిసే సమాయానికి 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయం సాధించింది. మరో 12 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను కివీస్ క్లోజ్ చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ 93 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 65 పరుగులు చేశారు. న్యూజిలాండ్ విజయం సాధించినప్పటికీ.. 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను భారత్ 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో ఈ టీ20 సిరీస్ ముగిసిన అనంతరం భారత్ ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలోనే మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 2026 క్యాలెండర్ ఇయర్లో కేవలం 40 మ్యాచుల్లోనే 400 సిక్సర్లు బాదిన వరల్డ్‌లోనే తొలిజట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధించింది. ఇవాళ జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఈ మైలురాయిని చేరుకుంది. అలాగే ఒకే ఏడాదిలో అత్యధిక సిక్స్‌లు బాధిన టీమ్ గా కూడా భారత్ తొలి స్థానంలో నిలిచింది.









