
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో అనేక ఎలక్ట్రానిక్స్ ప్రొడెక్టులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ సేల్, ఫోన్ ఆఫర్, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
దీపావళి స్పెషల్ సేల్ సందర్భంగా నథింగ్ ఫోన్ 4a పై 30% తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ అధికారిక పేజీలో దీని అసలు ధర రూ.49,999గా ఉంది. ఇప్పుడు ఈ సేల్ సమయంలో దీనిని కేవలం రూ.34,999లకే కొనుక్కోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ను వావ్ డీల్స్ ద్వారా కొనుగోలు చేస్తే.. దీనిని కేవలం రూ. 29,449 కే పొందవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలుుసుకుందాం.
నథింగ్ ఫోన్ 4a ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన పెద్ద 6.78-అంగుళాల AMOLED ఫ్లెక్సిబుల్ LTPS డిస్ప్లే ఉంది. దీని ఫలితంగా ఫోన్‌ను ఆపరేట్ చేసేటప్పుడు, స్క్రోల్ చేసేటప్పుడు మరింత స్మూత్ అనుభవం అందిస్తుంది. అలాగే సినిమాలు చూసేటప్పుడు, మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు కూడా సులభమైన అనుభవాన్ని పొందొచ్చు.
ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్లో 50MP + 50MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్లో 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. మంచి డిస్ప్లే, కెమెరాతో పాటు స్మార్ట్‌ఫోన్‌లో భారీ బ్యాటరీ కూడా అందించారు. ఈ నథింగ్ ఫోన్లో 5,400mAh బ్యాటరీ ఉంది. వేగవంతమైన పనితీరు, మల్టీటాస్కింగ్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 6GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది.









