తాజాగా విడుదలైన ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. అదే ‘రుద్రవనం పీఎస్’ (Rudravanam PS). నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ మిస్టరీ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్స్‌ ఉన్నాయి. ఈ సిరీస్ ఒక మారుమూల గ్రామంలో జరిగే వరుస హత్యల విచారణ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో రాజా రవీంద్ర, చారు వాకన్, బెనర్జీ, శ్రావణి రెడ్డి, ప్రీతి సుందర్, సుగాలి సిలోని తదితరులు నటించారు. శ్రీ చక్ర మూవీస్ నిర్మాణంలో తెరకెక్కింది.

కథేంటంటే:

రుద్రవనం అనే మారుమూల ఊరిలోని పోలీస్ స్టేషన్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అక్కడ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే హీరో నరేష్ అగస్త్య.. తన పై అధికారి (బెనర్జీ)తో కలిసి పనిచేస్తుంటాడు. హీరో సెలవుపై వెళ్లాలనుకున్న సమయంలో ఊహించని విధంగా ఒక గుర్తుతెలియని శవం దొరుకుతుంది. ఆ మర్డర్ మిస్టరీని చేధించే క్రమంలో వెలుగులోకి వచ్చే నిజాలు ఏంటి? ఆ కేసు వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటనేదే ఈ సిరీస్ కథ.

ప్లస్ పాయింట్స్:

నటన: సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నరేష్ అగస్త్య సెటిల్డ్, సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. చివరి ఎపిసోడ్‌లో అంజీ పాత్రలో చారు వాకన్ ఎమోషనల్‌గా బాగా నటించాడు.

టెక్నికల్ విలువలు: పవన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని పెంచింది. గ్రామీణ వాతావరణంలో అష్కర్ అలీ సినిమాటోగ్రఫీ, లైటింగ్ బాగున్నాయి.

జానర్: క్రైమ్, మర్డర్ మిస్టరీ, కాప్ స్టోరీలను ఇష్టపడేవారికి ఇది డిసెంట్ వాచ్.

అందువల్ల ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇది సూపర్ అని చెప్పుకోవచ్చు.