
ఒకప్పుడు కేవలం ఇసుక తిన్నెలతో, చెట్టు చేమలకు ఏమాత్రం ఆస్కారం లేని చైనాలోని తక్లమకాన్ ఎడారి(Taklamakan Desert) ఇప్పుడు సరికొత్త రూపం సంతరించుకుంటోంది. దాదాపు నాలుగు దశాబ్దాల నిరంతర కృషితో, చైనా చేపట్టిన “గ్రేట్ గ్రీన్ వాల్” ప్రాజెక్ట్ ద్వారా 2024 చివరి నాటికి ఈ ఎడారి అంచులను ఒక రక్షణాత్మక పచ్చని వలయంగా తీర్చిదిద్దారు.
Also Read : US ఎన్నికల్లో ఫస్ట్ టైం ఓటేసిన పోప్.. లియో-14 సరికొత్త రికార్డు
వ్యవసాయ విప్లవం – స్థానిక ఆదాయం
ఎడారి విస్తరణను అరికట్టడమే కాకుండా, ఈ గ్రీన్ బెల్ట్ ద్వారా స్థానికులకు చక్కటి జీవనోపాధి లభిస్తోంది. తక్లమకాన్ దక్షిణ అంచున ఉన్న పిషాన్ కౌంటీలో ఏకంగా 3,800 హెక్టార్లలో చైనీస్ స్నేక్ గార్డ్ మొక్కలను సాగు చేస్తున్నారు. వీటి పండ్లు, వేర్లను ఔషధాల తయారీలో ఉపయోగిస్తూ స్థానిక ప్రజలు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
వాతావరణానికి మేలు: కార్బన్ సింక్
తాజా శాటిలైట్ పరిశోధనలు (PNAS స్టడీ) ఈ ప్రాంతంపై ఆసక్తికర వాస్తవాలను వెల్లడించాయి. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరిపేటప్పుడు వెలువడే ‘సోలార్ ఇండ్యూస్డ్ ఫ్లోరోసెన్స్’ (SIF)ను స్పేస్ నుంచి ట్రాక్ చేయగా, ఈ ఎడారి అంచుల మొక్కలు విడుదల చేసే దానికంటే ఎక్కువ కార్బన్ డైయాక్సైడ్‌ను వాతావరణం నుంచి పీల్చుకుంటున్నాయని తేలింది. అంతేకాకుండా, ఇక్కడి ఎవాపో-ట్రాన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా చల్లటి వాతావరణం ఏర్పడి కూలింగ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది.
Also Read : అమెరికా సైలెంట్ ప్రిపరేషన్? సైనికులకు సమాధులు తవ్వే ట్రైనింగ్
పర్వతాల నీరే ప్రాణాధారం
మొత్తం ఎడారిని అడవిగా మార్చడం అసాధ్యం. అయితే కున్లున్, పామిర్, తియాన్ షాన్ పర్వతాల గ్లేసియర్లు కరిగి వచ్చే నీరు తారిమ్ బేసిన్‌కు చేరడం వల్లే ఇక్కడ సాగు మరియు ప్లాంటేషన్ సాధ్యమైంది. సరైన ప్లానింగ్, సైన్స్ ఆధారిత వాటర్ మేనేజ్మెంట్ మరియు స్థానిక వనరులను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తే పర్యావరణ పునరుద్ధరణ ఎంత అద్భుతాలు సృష్టిస్తుందో తక్లమకాన్ ప్రాజెక్ట్ నిరూపిస్తోంది.









