
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ మార్కెట్‌లోకి కొత్త మోడళ్లను పరిచయం చేసింది. అందులో మొత్తం OnePlus Ace 7, OnePlus Ace 7 PRO అనే రెండు మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లలో భారీ 9,000mAh బ్యాటరీ, 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 185Hz వరకు రిఫ్రెష్ రేట్ గల డిస్‌ప్లే ఉన్నాయి. ఎక్కువ సేపు గేమ్‌లు ఆడుతూ, వేగవంతమైన పనితీరును కోరుకునే వినియోగదారుల కోసం కంపెనీ ఈ ఫోన్‌లను రూపొందించింది.
ఈ సిరీస్‌లో ఆసక్తికరమైన విషయం కేవలం పెద్ద బ్యాటరీ మాత్రమే కాదు. ఫోన్‌ను కూల్‌గా ఉంచడానికి వన్‌ప్లస్ కూలింగ్ సిస్టమ్‌ను అందించింది. అలాగే గేమింగ్ కోసం స్పెషల్ చిప్‌లను, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా కలిగి ఉంది.
Also Read : వారెవ్వా కిర్రాక్ ఆఫర్: రూ.8వేలకే 32 ఇంచుల టీవీ.. వదలొద్దు మావా..!
OnePlus Ace 7 Price
12GB RAM + 256GB స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ ధర రూ.63,000 నుండి ప్రారంభం అవుతుంది. ఇతర వేరియంట్ల ధరలు రూ.70,000 నుండి ప్రారంభమై రూ.81,000 వరకు ఉంటాయి.
OnePlus Ace 7 pro Price
ఇదిలా ఉండగా వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో ధర సుమారుగా రూ. 69,000 నుండి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ 16GB RAM + 1TB స్టోరేజ్ ధర సుమారుగా రూ. 1.04 లక్షల ధరతో లభిస్తుంది.
వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్‌లో అత్యంత ఆకర్షణీయమైనది దాని బ్యాటరీ. ఇది 9,000mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే కంపెనీ రెండు ఫోన్‌లలోనూ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో వస్తుంది. అంతేకాకుండా బైపాస్ ఛార్జింగ్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. రెండు ఫోన్‌లలోనూ 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. సాధారణ వినియోగంలో దీని రిఫ్రెష్ రేట్ 165Hz వరకు ఉండగా.. ఎంపిక చేసిన గేమ్‌లలో ఇది 185Hz వరకు సపోర్ట్ చేస్తుంది.
Also Read : Hero Splendor సంచలన హవా: 70 కి.మీ మైలేజ్.. 79వేల ధర.. తొలి ఆరు నెలల్లో 21 లక్షలకు పైగా సేల్స్..!
ఎక్కువసేపు గేమింగ్ ఆడిన తర్వాత స్మార్ట్‌ఫోన్ వేడెక్కకుండా డ్యూయల్-పాత్ గ్లేసియర్ ఎయిర్-కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. కెమెరా విషయానికి వస్తే.. రెండు ఫోన్‌లలోనూ 200-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా ఉంది. ఇది OISకు కూడా మద్దతు ఇస్తుంది. రెండు ఫోన్‌లలోని ఇతర కెమెరాలు విభిన్నంగా ఉన్నాయి. వన్‌ప్లస్ ఏస్ 7లో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. అలాగే ఏస్ 7 ప్రోలో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంది.
వన్‌ప్లస్ ఏస్ 7 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 వి-సిరీస్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఏస్ 7 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17 పై పనిచేస్తాయి. ఈ రెండు ఫోన్‌లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.









