
అమెరికాలో ఒక అణు పరిశోధనా కేంద్రంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించడం తీవ్ర కలకలం రేపింది. సౌత్ కరోలినా రాష్ట్రంలోని యూఎస్ ఇంధన శాఖకు చెందిన సవన్నా రివర్ నేషనల్ లేబరేటరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్‌లోని ఒక గదిలో మంటలు చెలరేగడంతో రేడియోధార్మికత ఏమైనా లీకైందా అనే తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
Also Read : సొంత జనరల్స్పైనే ట్రంప్ వేటు.. ఇరాన్‌పై దాడికి ముందు.. అసలు కారణమేంటి?
రెండు గంటల్లో అదుపుసౌత్ కరోలినాలోని సవన్నా రివర్ నేషనల్ లేబరేటరీ భవనంలో బుధవారం సాయంత్రం అనుకోకుండా మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రక్షణ బృందాలు వేగంగా స్పందించాయి. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు మాత్రం తక్షణమే వెల్లడికాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే రేడియేషన్ బయటకు వస్తుందేమోననే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన అధికారులు ప్రమాద స్థలం నుంచి భవనం వెలుపలికి ఎలాంటి రేడియోధార్మికత విడుదల కాలదని స్పష్టం చేశారు.
రేడియోధార్మికత ప్రభావం కేవలం ఆ ల్యాబ్ ప్రాంగణంలోని ఆ గదికి మాత్రమే పరిమితమైందని, బయట తిరుగుతున్న సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపారు. రాకపోకల నిలిపివేతప్రమాదం పెద్దది కాకపోయినా, అణు పరిశోధన కేంద్రం కావడంతో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఏ చిన్న రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ లేబరేటరీ ప్రవేశ మార్గాలన్నింటినీ తాత్కాలికంగా మూసివేశారు. అంతేకాకుండా లేబరేటరీకి సమీపంలో ఉన్న దారులలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అజమాయిషీలోనే ఉందని, ల్యాబ్ పరిసరాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
Also Read : ‘SI’! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మార్చిన ట్రంప్









