
పాకిస్థాన్ ప్రజలకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అమెరికా ప్రెజర్ కారణంగా పాకిస్థాన్ తమ సరిహద్దులను మూసివేయడంతో, ఇరాన్ వెంటనే పాకిస్థాన్‌కు LPG ఎగుమతులను పూర్తిగా నిలిపివేసింది. పాకిస్థాన్ మొత్తం ఎల్పిజి ఇంపోర్ట్స్‌లో దాదాపు 50 శాతం ఒక్క ఇరాన్ నుంచే వస్తాయి. ఈ సప్లై ఆగిపోవడంతో కొద్ది రోజుల్లోనే 12 కేజీల సిలిండర్ ధర 4,500 పాకిస్తానీ రూపాయల ($16) నుంచి ఏకంగా 7,000 రూపాయలకు ($25) చేరింది.
అక్టోబర్ 17న గబ్ద్-రిమ్దాన్, తఫ్తాన్ సరిహద్దులను ఇరు దేశాలు క్లోజ్ చేశాయి. సెక్యూరిటీ సమస్యలు, స్మగ్లింగ్ కంట్రోల్ చేయడానికే ఈ నిర్ణయమని బలూచిస్తాన్ ప్రభుత్వం చెప్పగా, టెక్నికల్ రీజన్స్ వల్లేనని ఇరాన్ వెల్లడించింది. సాధారణంగా ఇరాన్ నుంచి పాకిస్థాన్‌కు రోజుకు సుమారు 7,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి దిగుమతి అవుతుంది. ఇందులో గబ్ద్-రిమ్దాన్ బార్డర్ ద్వారానే 4,000 టన్నుల గ్యాస్ సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఇంపోర్ట్స్ పూర్తిగా నిలిచిపోవడంతో ఎల్పిజి ట్యాంకర్లు, కూరగాయలు, బియ్యంతో కూడిన 1,000కి పైగా కంటైనర్లు బార్డర్ దగ్గరే నిలిచిపోయాయి.
ఈ బార్డర్ బ్లాకేడ్ వల్ల బలూచిస్థాన్‌లో సిలిండర్ ధర రూ.7,000, లాహోర్‌లో ₹7,500, స్కార్డూలో గరిష్టంగా ₹8,200 వరకు పలుకుతోంది. గతంలో కిలో ఎల్పిజి ₹250 ఉండగా, ఇప్పుడు లాహోర్ వంటి నగరాల్లో కిలోకు ₹500 నుంచి ₹600 వరకు వసూలు చేస్తున్నారు. రానున్న వింటర్ సీజన్లో గ్యాస్ డిమాండ్ పెరిగి కొరత మరింత తీవ్రమవుతుందని ప్రజలు భయపడుతున్నారు.
ఇరు దేశాల మధ్య 2023-24లో దాదాపు $2.8 బిలియన్ల ట్రేడ్ జరిగింది. ప్రస్తుతం డ్రైవర్లు కనీస ఫెసిలిటీస్ లేక బార్డర్ వద్ద వారం రోజులకు పైగా పడిగాపులు కాస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ టెహ్రాన్ వెళ్లి ఇరాన్ లీడర్లతో బార్డర్ ఇష్యూస్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై చర్చలు జరిపారు. త్వరలోనే ట్రేడ్ మళ్లీ స్టార్ట్ చేయడానికి చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది.









