
Driving License : కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) డ్రైవింగ్ లైసెన్స్ జారీ, పునరుద్ధరణ నిబంధనల్లో కీలక మార్పులు ప్రతిపాదించింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌కు సంబంధించి ముసాయిదా సవరణలను విడుదల చేస్తూ, సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
Also Read : కార్లలో ఇకపై AEBS తప్పని సరి: కేంద్రం కొత్త రూల్!
ప్రధాన మార్పులివే
భారతీయులు, విదేశీయులకు వేర్వేరు రంగులు: ఇండియన్ సిటిజన్లు, ఫారిన్ నేషనల్స్‌కు జారీ చేసే లేదా రెన్యూ చేసే లైసెన్సుల గుర్తింపును సులభతరం చేసేందుకు ప్రత్యేక కలర్ స్కీమ్‌లను తీసుకురానున్నారు. ప్రతి లైసెన్స్ కూడా లామినేటెడ్ లేదా PVC కార్డు రూపంలోనే ఉండనుంది.
ఎమర్జెన్సీ వివరాలు తప్పనిసరి: రోడ్డు భద్రత, అత్యవసర సమయాల్లో వైద్య సహాయం కోసం లైసెన్స్ కార్డుపై బ్లడ్ గ్రూప్, మొబైల్ నంబర్ మరియు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లను తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు.
సేఫ్ డ్రైవింగ్ ట్యుటోరియల్: డ్రైవింగ్ సేఫ్టీ అసెస్‌మెంట్‌ను కఠినతరం చేస్తూ అర్హత మార్కులను 60 శాతం నుండి 75 శాతానికి పెంచారు. ఈ ఆన్‌లైన్ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు సాగనుంది.
ఆధార్‌తో ఉచిత సేవలు: ఆధార్ ధ్రువీకరణ ద్వారా పూర్తి చేసే ఎంపిక చేసిన ఆన్‌లైన్ సేవలపై ఫీజు మినహాయింపు ఇవ్వనున్నారు.
వ్యక్తిగత వివరాల మార్పులకు గడువు: పేరు, చిరునామా వంటి మార్పుల దరఖాస్తులను ఆర్టీవో అధికారులు 15 రోజుల్లోగా ఆమోదించడం లేదా తిరస్కరణకు కారణాలు చూపుతూ పరిష్కరించాలి. వ్యక్తిగత వివరాల మార్పుకు అయ్యే చార్జీలను కూడా తొలగించాలని ముసాయిదాలో పేర్కొన్నారు.
ధ్రువీకరణ పత్రాలు: వయస్సు, చిరునామా, గుర్తింపు రుజువుల కోసం ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు, ఈ-రేషన్ కార్డు, ఎల్‌ఐసీ పాలసీల వంటి డాక్యుమెంట్లను అనుమతిస్తారు. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన ప్రమాణాలను ప్రభుత్వం నిర్దేశించింది.
ఈ ప్రతిపాదిత మార్పులపై ప్రజలు, సంబంధిత వర్గాల నుండి 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.
Also Read : PM కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ









