Samsung Galaxy F70 5G Price
Samsung Galaxy F70 5G Price

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ తన లైన‌ప్‌లోని మరో కొత్త మోడల్‌ను మార్కెట్‌లో పరిచయం చేసింది. తాజాగా భారతదేశంలో Samsung Galaxy F70 5Gని విడుదల చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. ఇందులో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ 5nm ఎక్సినోస్ 1330 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ Samsung Galaxy F70 5G ధర, దాని స్పెషల్ ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Samsung Galaxy F70 5G Price

భారతదేశంలో Samsung Galaxy F70 5G బేస్ వేరియంట్ ధర రూ.17,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ వివిడ్ వైలెట్, బోల్డ్ బ్లాక్ అనే రెండు కలర్‌లలో లభిస్తుంది. ఇప్పుడీ ఫోన్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కొనుక్కోవచ్చు. దీని అమ్మకాలు అక్టోబర్ 20న ప్రారంభం కానున్నాయి.

Samsung Galaxy F70 5G Specifications

Samsung Galaxy F70 5G ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080 × 2340 పిక్సెల్‌లకు సపోర్ట్ చేస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మాలి-G68 MP2 GPUతో కూడిన 5nm ఎక్సినోస్ 1330 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ UI 9.5 కస్టమ్ స్కిన్‌పై నడుస్తుంది. స్టోరేజ్‌ను విస్తరించడానికి ఇది మైక్రో SD కార్డ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ Samsung Galaxy F70 5G ఫోన్‌లో వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా ఉంది. దీనికి OIS సపోర్ట్‌తో కూడిన 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 5000mAh బ్యాటరీ ఉంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.