Sunday, June 14, 04:00
24.8 C
Hyderabad

BIG BREAKING : రాజ్యసభ జనసేన అభ్యర్థి ఖరారు.. ప్రకటించిన పవన్ కళ్యాణ్

Lingamaneni Ramesh
Lingamaneni Ramesh

జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. శనివారం మధ్యాహ్నం లింగమనేని రమేష్ తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. 2015 నుంచే ఆయనకు జనసేన పార్టీతో అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, సామాజిక వర్గాల మధ్య సఖ్యత కుదరాలన్నా సోషల్ ఇంజినీరింగ్ అవసరమనే పవన్ కల్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆయన పార్టీ వెన్నంటి నడుస్తున్నారు. అదే నమ్మకంతో ఇప్పుడు లింగమనేని రమేష్‌ను రాజ్యసభకు ఎంపిక చేశారు.

ఇది కూడా చూడండి: Mina Ala Fahal terminal : ఒమన్‌ ఆయిల్ టర్మినల్‌పై డ్రోన్‌ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!

తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై లింగమనేని రమేష్ స్పందించారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కూటమి తరఫున తనకు మద్దతు ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కల్యాణ్ తనకు ఇచ్చింది పదవి కాదు.. ఒక బలమైన బాధ్యత అని రమేష్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్ర శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.

 

ఇది కూడా చూడండి: Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్:  చైనా, టర్కీ ఆయుధాలపై పాక్ కన్ను!