
దసర, దీపావళి పండుగలు వచ్చేస్తున్నాయ్. ఈ సమయంలో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా ఈ పండుగల సమయంలో తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటీని కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. కేవలం రూ.1లక్ష కంటే తక్కువ ధరకే అదిరిపోయే స్కూటీని కొనుక్కోవచ్చు. మార్కెట్లో ఐదు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో Ola S1 Z, VIDA VX2 Go 3.4, Ampere Magnus Neo, Pure EV Entrance Neo SX, Bajaj Chetak C2501 మోడళ్లు ఉన్నాయి. వీటికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 179 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఇప్పుడు వాటి ధరలు, మైలేజీ, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Ola S1 Z
Ola S1 Z మోడల్లోని 3.1kWh వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌పై 179 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లుగా ఉంది. ఇది 4.6 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.79,999గా నిర్ణయించింది.
Pure EV Entrance Neo SX
Pure EV Entrance Neo SX స్కూటర్ 1.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 70 కిలోమీటర్ల నుండి 101 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీనికి 10 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీ కూడా లభిస్తుంది. ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.84,836గా ఉంది.
VIDA VX2 Go 3.4
రూ.లక్షలోపు లభించే మరో స్కూటర్ VIDA VX2 Go 3.4. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 146 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 3.4 kWh సామర్థ్యం కలిగిన ఈ బ్యాటరీ రిమూవబుల్ ఆప్షన్‌తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 95,000 గా కంపెనీ నిర్ణయించింది.
Bajaj Chetak C2501
Bajaj Chetak C2501 స్కూటర్లో 2.5kWh బ్యాటరీ అందించారు. దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 113 కి.మీ మైలేజీ అందిస్తుంది. అలాగే కంపెనీ ఈ స్కూటర్‌పై 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల వారంటీని ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందులో మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. అవి ఎకో, స్పోర్ట్స్, టెక్పీక్. Bajaj Chetak C2501 స్కూటర్ ముందువైపు డిస్క్ బ్రేకులు, వెనుకవైపు డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.99,802గా ఉంది.
Ampere Magnus Neo
Ampere Magnus Neo కూడా మంచి మైలేజీ అందిస్తుంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై దాదాపు 125 కిలో మీటర్ల రేంజ్‌తో పరుగులు పెడుతుంది. దీని బ్యాటరీ ఫుల్‌గా ఛార్జ్ కావడానికి 6 గంటల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.90,999 గా ఉంది.









