Anirudh-Kavya Maran Wedding
Anirudh-Kavya Maran Wedding

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా.. ఒకే ఒక్క లవ్ కపుల్‌కు సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వారు మరెవరో కాదు.. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్. ఈ ప్రేమ పక్షులు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. గత కొంత కాలంగా వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొట్టగా.. ఇప్పుడు అది నిజం కాబోతుందని తెలియడంతో ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

Also Read : రణబాలి రివ్యూ.. విజయ్ – రష్మిక కాంబో హిట్టా – ఫట్టా?

ఈ జంట గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున టాక్ నడిచింది. అంతేకాకుండా వీరిద్దరిపై ఎన్నో మీమ్స్, వైరల్ ట్రోల్స్ కూడా తెగ పుట్టుకొచ్చాయి. దీనికి తోడు వీరు విదేశాల్లో కలిసి తిరిగిన ఫొటోలు వైరల్‌గా మారడంతో త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కబోతుంది అంటూ ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ వార్తలను ఈ జంట కొట్టిపారేసింది. ఇక ఇటీవలే అనిరుధ్ బంధువు, ప్రముఖ నటుడు వైజీ మహేంద్ర ఈ లవ్ కపుల్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వీరు మంచి జోడీ అవుతారంటూ పరోక్షంగా చెప్పుకొచ్చారు. అవన్నీ ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

అనిరుధ్

తాజా సమాచారం ప్రకారం.. ఈ ట్రెండింగ్ జోడీ వివాహం అంగరంగ వైభవంగా విదేశాల్లో జరగనున్నట్లు టాక్ నడుస్తోంది. నవంబర్ 11న గ్రీస్ దేశంలో అనిరుధ్ – కావ్యా మారన్‌ల పెళ్లి అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌లో సినీ, రాజకీయ ప్రముఖులందరి కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టేసినట్లు సమాచారం.

అనిరుధ్

ఇందులో భాగంగానే పలు రాష్ట్రాల సీఎంలకు వివాహ ఆహ్వాన పత్రికలను అందజేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. పెళ్లికూతురు కావ్యామారన్ తండ్రి.. సన్ గ్రూప్ ఛైర్మన్ కలానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ కలిసి ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం డీ.కే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి వివాహ పత్రికలు అందజేశారు. దీంతో అనిరుధ్, కావ్యా ఒక్కటి కాబోతుండటంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read : పునీత్ చనిపోయే ముందు ఏం జరిగిందంటే.. ఐదేళ్ల తర్వాత అసలు విషయం బయటపెట్టిన డాక్టర్