
Albania : గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలపై యువత తిరుగుబాటు చేస్తోంది. ఆయా దేశాల యూత్ పవర్‌కు ప్రభుత్వాలే కూలిపోయాయి. అక్రమాలు, అవినీతి, రాజకీయాల్లో అసంతృప్తి కారణంగా వరుసగా శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, దేశాల్లో విధ్యార్ధులు ప్రభుత్వాలపై ఉద్యమించారు. ఇండియాలో కూడా జెన్ జీ ఉద్యమం స్టార్ట్ అయ్యింది. అదే తరహాలో ఇప్పుడు మరో యూరప్ కంట్రీలో యూత్ ఆదోళనలు మొదలయ్యాయి. అల్బేనియా రాజధాని తిరానాలో విద్యార్థుల ఆధ్వర్యంలో మొదలైన నిరసనలు తీవ్ర రాజకీయ, సామాజిక సంక్షోభానికి దారితీశాయి. మెరుగైన విద్యా వసతులు, ఫీజుల నియంత్రణ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్లతో అక్టోబర్ 13న విద్యా మంత్రిత్వ శాఖ ఎదుట ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ప్రధాని ఎడీ రామా రాజీనామా కోరే స్థాయికి చేరింది.
Also Read : ముంచుకొస్తున్న ప్రమాదం.. కరుగుతున్న ‘డూమ్స్‌డే’ హిమానీనదం!
గత మూడు రోజులుగా తిరానా వీధుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక, హోం శాఖ భవనాలతో పాటు ప్రైవేట్ బ్యాంకులపై ఆందోళనకారులు దాడులు చేసి నిప్పుపెట్టారు. పరిస్థితి అదుపుతప్పడంతో పార్లమెంట్ సమావేశాలు కూడా రద్దయ్యాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు, ఓ జర్నలిస్ట్ గాయపడగా, 39 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. పోలీసుల దాడిపై మానవ హక్కుల సంఘాలు స్వతంత్ర విచారణ కోరుతున్నాయి.
ఈ ఉద్యమానికి జారెడ్ కుష్నర్ లగ్జరీ రిసార్ట్ వివాదం (‘ఫ్లెమింగో క్రాంతి’) మరింత ఆజ్యం పోసింది. స్థానికుల భూములను అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష నేత సాలీ బెరీషా విద్యార్థులకు మద్దతు ప్రకటించగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రధాని రామా స్పష్టం చేశారు.
మరోవైపు, తూర్పు ఐరోపాలో తలెత్తుతున్న ఇలాంటి అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిణామాలు, ఐరోపా సమాఖ్య ఆర్థిక మందగమన సంకేతాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు డిమాండ్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణించే సంకేతాలు కనిపిస్తుండటం భారత్‌కు పెద్ద ఊరటనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అలాగే డిమాండ్ సమతుల్యత మారడంతో, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఐరోపాలో అంతర్గత సంక్షోభాలు కొనసాగుతున్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల భారత్‌లో ఇంధన ధరల భారం దిగివస్తుండటం దేశీయ వినియోగదారులకు సానుకూల అంశంగా మారింది.
Also Read : జర్మనీలో షాకింగ్ ఘటన.. 16 ఏళ్ల బాలికపై రోబో దారుణం.. అసలు ఏమైందంటే?









