
GPS Tracker : వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తో పాటు ఇతర భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడి అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే మ్యాచ్‌ల్లో వారి ఆటతో పాటు మరో విషయం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అదే.. ఆటగాళ్లు భుజాలపై పెట్టుకుని కనిపించిన ఓ చిన్న టెక్నాలజీ డివైజ్. క్రికెటర్లు భుజాల దగ్గర పెట్టుకున్న ఈ డివైజ్ సాధారణ క్రికెట్ పరికరం కాదు. అలాగే సాధారణ హెల్త్ ట్రాకర్ కూడా కాదు. ఇది ప్రత్యేకంగా ఆటగాళ్ల ఫిజికల్ వర్క్‌లోడ్‌ను ట్రాక్ చేయడానికి ఉపయోగించే ప్లేయర్ ట్రాకర్.
స్పోర్ట్స్‌లో ఇలాంటి టెక్నాలజీకి చాలా ప్రాధాన్యం ఉంది. కోచ్‌లు, ఫిట్‌నెస్ సిబ్బంది, ఆటగాళ్లు.. ఈ డివైజ్ ద్వారా వచ్చే డేటాను చూసి ఆటగాడు ఎంతసేపు, ఎంత తీవ్రతతో శ్రమించాడో తెలుసుకోవచ్చు. భారత క్రికెటర్లు కొంతకాలంగా GPS ఆధారిత ప్లేయర్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరికరాలను స్టాట్స్‌పోర్ట్స్ వంటి కంపెనీలు అందిస్తున్నాయి.
Also Read : వడ్డీ రేట్లను పెంచిన ఆర్‌బీఐ.. సామాన్యులపై ప్రభావం పడనుందా?
ఈ చిన్న డివైజ్‌ను సాధారణంగా ఆటగాళ్లు వేసుకునే కంప్రెషన్ లేదా బేస్ లేయర్ బనియన్ వెనుక ఉన్న ప్రత్యేక జేబులో పెడతారు. భుజాల ఎముకల మధ్య ఉండేలా దీన్ని సెట్ చేస్తారు. ఇందులో GPS, మోషన్ సెన్సర్లు ఉంటాయి. ఇవి ఆటగాడు ఎంత దూరం పరిగెత్తాడు, ఎంత వేగంగా పరిగెత్తాడు, ఎప్పుడు వేగం పెంచాడు, ఎప్పుడు తగ్గించాడు, ఎంత వర్క్‌లోడ్ తీసుకున్నాడు వంటి వివరాలను రికార్డ్ చేస్తాయి. ఈ ట్రాకర్‌ను హార్ట్ రేట్ మానిటర్‌కు కనెక్ట్ చేస్తే గుండె వేగానికి సంబంధించిన డేటా కూడా రికార్డ్ అవుతుంది. దీంతో ఆటగాడి శారీరక శ్రమపై మరింత స్పష్టమైన సమాచారం కోచ్‌లు, ఫిట్‌నెస్ టీమ్‌కు అందుతుంది.
భారత్-వెస్టిండీస్ సిరీస్‌లో ఈ GPS డివైజ్‌లను ఉపయోగించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను సరిగ్గా మేనేజ్ చేయడమే. ట్రైనింగ్ సమయంలో బయటకు కనిపించే విషయాలపైనే ఆధారపడకుండా.. ప్రతి ఆటగాడిపై ఎంత శారీరక ఒత్తిడి పడిందో డేటా ద్వారా ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమాచారాన్ని తర్వాతి ట్రైనింగ్ సెషన్‌లో ఉపయోగిస్తారు. ఆటగాడికి ఎంత తీవ్రతతో ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంత విశ్రాంతి అవసరం, వర్క్‌లోడ్‌ను ఎంత తగ్గించాలి లేదా పెంచాలి అనే విషయాలను నిర్ణయించుకోవడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా వరుసగా మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆటగాళ్ల అలసటను తగ్గించడం, గాయాల ప్రమాదాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. అలాంటి సమయంలో ఈ చిన్న డివైజ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆటగాడిపై అవసరానికి మించి భారం పడుతుందా అతడికి మరింత రికవరీ అవసరమా అనే విషయాలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. అంటే కోహ్లీ, రోహిత్‌ల వీపుపై కనిపించిన ఆ చిన్న డివైజ్ కేవలం ఓ ట్రాకర్ కాదు.. ఆటగాళ్ల వర్క్‌లోడ్, రికవరీ, ఫిట్‌నెస్‌ను మేనేజ్ చేయడంలో కోచ్‌లకు ఉపయోగపడే టెక్నాలజీ టూల్.
Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. హిందూ సంప్రదాయంలో పెళ్లి.. ఆ తర్వాత షాకింగ్ ట్విస్ట్









