తెలంగాణలో నేటి నుంచి రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలంలో ఏకంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే తల్లాడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములుగు జిల్లా వెంకటాపురం వంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని ఈదురు గాలులు బలంగా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చూడండి: భక్తి ముసుగులో IIT కామాంధుడు….ప్రవచనాలు చెబుతూ అమ్మాయిలతో రాసలీలాలు!
ఇది కూడా చూడండి: BIG BREAKING : ఘోరం.. రెండు బస్సులు ఢీ… ఏడుగురు మృతి!
ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ క్రమంలోనే ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాలను తాకే అవకాశం ఉంది. రుతుపవనాల కదలికల వల్ల తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
ఇది కూడా చూడండి: CBSEలో మోదీ ప్రభుత్వం భారీ ప్రక్షాళన.. చైర్మన్, సెక్రటరీలపై బదిలీ వేటు!










