
Japan New Rules : జపాన్ వెళ్లి అక్కడ పర్మనెంట్‌గా సెటిల్ కావాలనుకునే విదేశీయులకు అక్కడి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ పొందే ప్రాసెస్ ఖర్చును ఏకంగా 20 రెట్లు పెంచేసింది. కేవలం ఫీజులు పెంచడమే కాకుండా అక్కడ సెటిల్ కావడానికి మూడు కఠినమైన కొత్త కండిషన్లను కూడా యాడ్ చేసింది. దీంతో జపాన్ డ్రీమ్ ఉన్నవారికి ఇకపై భారీగా ఖర్చు కానుంది. ఇప్పటి వరకు జపాన్‌లో తాత్కాలికంగా నివసిస్తున్న విదేశీయులు తమ వీసా గడువు పొడిగించుకోవాలన్నా లేదా నివాస హోదా మార్చుకోవాలన్నా కేవలం 6,000 యెన్లు చెల్లిస్తే సరిపోయేది. కానీ అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పాత రూల్స్‌ని పూర్తిగా మార్చేశారు.
Also Read : గుర్తు పెట్టుకోండి : ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకునే పేరు ఇది… ట్రంప్ నుంచి మోదీ వరకు భారత పైలట్ కు సలామ్!
🚨 JUST IN: JAPAN RAISES PERMANENT RESIDENCY FEE 20-FOLD! 🇯🇵
Japan has increased the permanent residency application fee for foreigners from ¥10,000 to ¥200,000, effective October 1, 2026, as Tokyo rolls out broader immigration-policy changes.
A staggering 1,900% hike. pic.twitter.com/5EmjFhoqRn
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 2, 2026
ఇక నుంచి మీరు అక్కడ ఉండే సమయాన్ని బట్టి ఫీజులు వసూలు చేస్తారు. 3 నెలల చిన్న కాలపరిమితి కోసం 10,000 యెన్లు, అదే 5 సంవత్సరాల కాలానికి అయితే 75,000 యెన్ల వరకు కట్టాల్సి ఉంటుంది. ఇక పర్మనెంట్ రెసిడెన్సీ కోసం అప్లై చేసుకోవాలంటే ఏకంగా 200,000 యెన్లు సమర్పించుకోవాలి. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1.22 లక్షలకు పైమాటే. ఫీజులు ఈజీగా కట్టేస్తామని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే జపాన్ ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టింది. మొదటి చేతినిండా సంపాదన ఉండాలి. జపాన్‌లో ఉండే సగటు కుటుంబ ఆదాయానికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్థిరమైన ఆదాయం వస్తుంటేనే పిఆర్ ఇస్తారు. 2024 తాజా లెక్కల ప్రకారం జపాన్‌లో ఒక కుటుంబ సగటు ఆదాయం ఏడాదికి 5.75 మిలియన్ యెన్లు.
Also Read : రష్యా సైనికులకు బిగ్ షాక్… జాంబీ కార్లతో ఉక్రెయిన్ అటాక్
రెండో కండిషన్ లాంగ్వేజ్‌కు సంబంధించినది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులకు జపనీస్ భాష రావడం తప్పనిసరి చేశారు. ఇక మూడో కండిషన్ ఏంటంటే పెన్షన్ కాంట్రిబ్యూషన్. జపాన్‌లో 30 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తూ పెన్షన్ స్కీమ్‌కి డబ్బులు కట్టిన ఒక సాధారణ వ్యక్తికి ఎంతైతే పింఛను ప్రయోజనాలు లభిస్తాయో.. దరఖాస్తు చేసుకునే నాటికి మీకు కూడా దానికి సమానమైన పింఛను అర్హత ఉంటేనే శాశ్వత నివాసానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.
అసలు జపాన్ సర్కార్ ఒక్కసారిగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనికి ముఖ్య కారణం ప్రధానమంత్రి సనాయే తకైచి నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో వేగంగా పెరిగిపోతున్న విదేశీ జనాభాను కంట్రోల్ చేయడానికే అని తెలుస్తోంది. 2025 చివరి నాటికి జపాన్‌లో విదేశీ నివాసితుల సంఖ్య దాదాపు 4.12 మిలియన్లకు చేరుకుంటుందని ఒక అంచనా. ఇది గతంతో పోలిస్తే ఏకంగా 9.5 శాతం ఎక్కువ. విదేశీయులు ఒక్కసారిగా పెరిగిపోతుండటంతో అక్కడ భద్రత, సామాజిక మార్పులపై ఆందోళనలు మొదలయ్యాయి. అందుకే పీఆర్ దరఖాస్తులను ఫిల్టర్ చేయడానికి ప్రభుత్వం ఈ కఠిన కండిషన్స్‌ను పెట్టింది.
నిజానికి జపాన్‌లో యువత సంఖ్య తగ్గిపోయి వృద్ధులు ఎక్కువైపోతుండటంతో అక్కడ పనిచేసే వారి కొరత ఉంది. పనుల కోసం విదేశీ కార్మికులు అవసరమే అయినప్పటికీ, రూల్స్ సరిగ్గా పాటించే, నాణ్యమైన విద్య, ఆదాయం ఉన్న వారిని మాత్రమే తమ దేశంలో శాశ్వతంగా ఉంచుకోవాలని జపాన్ భావిస్తోంది. అందుకే వీసా, ప్రాసెసింగ్ ఛార్జీలను భారీగా పెంచుతూ విదేశీయులకు గట్టి షాక్ ఇచ్చింది.









