Prakasam : ఇరుముడి సినిమా గుర్తుందా? ఈ సినిమాలో ఓ టీచర్.. స్పెషల్ క్లాసులు అంటూ లేడీ స్టూడెంట్స్‌ను మభ్యపెట్టి, ఓ ఎమ్మెల్యే దగ్గరకు తీసుకెళ్లి అప్పగిస్తూ ఉంటుంది. తాజాగా ఏపీలో జరిగిన ఓ ఘటన కూడా అదే సీన్‌ను గుర్తు చేస్తోంది. కాకపోతే ఆ సినిమాలో టీచర్ అయితే.. ఇక్కడ హాస్టల్‌లో పనిచేసే వంట మనిషి. ప్రకాశం జిల్లా జరుగుమల్లి కేజీవీబీకి చెందిన కొందరు విద్యార్థినులను హాస్టల్ వంట మనిషి మభ్యపెట్టి ఒంగోలులోని ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ ఆ వ్యక్తి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Also Read : కల్కి భగవాన్ ఇక లేరు.. శనివారం అంత్యక్రియలు!

దీంతో భయపడిపోయిన విద్యార్థినులు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులకు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని డీఆర్డీఏలో పనిచేసి రిటైర్ అయిన వెంకటేష్‌గా గుర్తించినట్లు సమాచారం.

విద్యార్థినులను హాస్టల్ నుంచి ఎందుకు తీసుకెళ్లారు? వారిని ఆ వ్యక్తి ఇంటికి ఎందుకు తీసుకెళ్లారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినిమాలో స్పెషల్ క్లాసులు పేరుతో జరిగే సన్నివేశం.. ఇప్పుడు ఏపీలో జరిగిన ఈ ఘటనను గుర్తు చేస్తుండటంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

Also Read : ఇబ్రహీంపట్నం మహిళ హత్య మిస్టరీ వీడింది.. ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.