
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సూపర్ ఇంటెలిజెన్స్ గా పిలవనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి అధికారిక పత్రంపై కూడా సంతకం చేయనున్నట్లు చెప్పారు. వైట్‌హౌస్‌లో టెక్ రంగానికి చెందిన ప్రముఖులతో ట్రంప్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : సిలికాన్ వ్యాలీలో కలకలం.. 100 మందికి పైగా పేర్లతో రహస్య జాబితా
సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇది ఆర్టిఫిషియల్ కాదు. అందుకే దీని పేరును సూపర్ ఇంటెలిజెన్స్‌గా మారుస్తున్నాం అని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు దీనికి సంబంధించిన అధికారిక పత్రంపై సంతకం చేస్తామని తెలిపారు. సూపర్ ఇంటెలిజెన్స్ గురించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది అమెరికాకు చాలా పెద్ద అవకాశమని చెప్పారు. ఇది ఇంటర్నెట్ కంటే చాలా పెద్దది. ఇంత వేగంగా ఎదుగుతున్న టెక్నాలజీని ఎప్పుడూ చూడలేదని అన్నారు.
AI కోసం భారీ డేటా సెంటర్లు అవసరమవుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలతో టెక్ కంపెనీలు కలిసి పనిచేయాలని ట్రంప్ సూచించారు. డేటా సెంటర్లు ఏర్పాటయ్యే ప్రాంతాల్లోని ప్రజలకు కంపెనీలు ఆర్థికంగా, ఇతర మార్గాల్లో సహాయం చేయాలని అన్నారు. స్థానిక పాఠశాలలు, టీచర్లకు కూడా కంపెనీలు సహాయం చేయాలని.. ఆయా ప్రాంతాలతో కలిసి పనిచేసేలా భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
AIను సరిగ్గా ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని ట్రంప్ అన్నారు. అయితే ఈ టెక్నాలజీని తప్పుగా ఉపయోగించే అవకాశాలపై కూడా జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో AIను సురక్షితంగా, బాధ్యతగా అభివృద్ధి చేయడంపై చర్చించారు. టెక్నాలజీపై ప్రజల్లో నమ్మకం పెంచడం ముఖ్యమని మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. అమెరికా టెక్నాలజీలో ముందుండటం దేశ భద్రతకు కూడా చాలా ముఖ్యమని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జే క్లేటన్ పేర్కొన్నారు.
Also Read : సైనిక చర్యలకు సిద్ధమైన అమెరికా.. ఆయుధాలు చేపడుతున్న ఇరాన్ మహిళలు









