
ఇజ్రాయెల్‌తో దౌత్యపరమైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఉద్దేశించిన అబ్రహం ఒప్పందాల విషయంలో పాకిస్తాన్ వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరినప్పటికీ ఈ ఒప్పందాలలో చేరే ప్రసక్తే లేదని పాకిస్తాన్ చెప్పినట్లు తెలుస్తోంది. 2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, పలు అరబ్ దేశాల మధ్య కుదిరిన అబ్రహం ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా ఇజ్రాయెల్‌తో ఆయా దేశాలు ఆర్థిక, దౌత్య, రక్షణ సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో మరిన్ని ముస్లిం దేశాలను ఒప్పందంలోకి తీసుకురావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఇరాన్ వంటి దేశాలతో నెలకొన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ట్రంప్ భావిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి ఊహించని షాక్.. ఆందోళనలో మూవీ టీమ్!
తాము మద్ధతు ఇవ్వబోమని..
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ దీనిపై స్పందిస్తూ.. తమ దేశ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఏ ఒప్పందానికీ తాము మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు. మాట మీద నిలబడని దేశాలతో కలిసి ఎలా చర్చలు జరపగలమని ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పాకిస్తాన్ పాస్‌పోర్ట్‌లపై ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశానికి చెల్లదని రాసి ఉంటుందని, ఆ దేశాన్ని పాకిస్తాన్ గుర్తించడం లేదన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ వైఖరి చాలా స్పష్టంగా ఉందని.. దీన్ని మార్చుకునే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఒప్పందాల్లో చేరాలని ట్రంప్ సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాలకు పిలుపునిచ్చారు.
ఇది కూడా చూడండి: Total Fertility Rate : భారత్‌లో పడిపోతున్న జననాల రేటు (TFR)….. చైనా బాటలో దేశం.. ఆందోళనలో నిపుణులు!









