Wednesday, June 3, 23:51
30.2 C
Hyderabad

Weather Update: డేంజర్ బెల్స్.. మండుటెండలతో అల్లాడుతున్న రాష్ట్రం.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్

Summer
Summer

తెలంగాణ, ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక పలు జిల్లాల్లో ప్రజలు మృతి చెందుతున్నారు. అయితే నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో సోమవారం ఏకంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే జగిత్యాల, సూర్యాపేట, నిజామాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి జిల్లాల్లో కూడా 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఇది కూడా చూడండి: Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి ఊహించని షాక్.. ఆందోళనలో మూవీ టీమ్!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఎండలు అధికంగా ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాహం వేయకపోయినా ఎక్కువ మొత్తంలో నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లవద్దని.. వెళ్తే.. తలకు టోపీ లేదా గొడుగు ధరించాలని తెలిపారు. అలాగే కాటన్ దుస్తులు ధరించడం మంచిదన్నారు.

ఇది కూడా చూడండి: Total Fertility Rate : భారత్‌లో పడిపోతున్న జననాల రేటు (TFR)….. చైనా బాటలో దేశం.. ఆందోళనలో నిపుణులు!