
హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ వేలంపాట(Balapur Laddu Auction) పై అందరి దృష్టి నెలకొంది. గత 31 సంవత్సరాలుగా నిరంతరాయంగా సాగుతున్న ఈ వేలం సాంప్రదాయం ప్రతిఏటా సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. ఈసారి కూడా 21 కేజీల లడ్డూను తమ సొంతం చేసుకునేందుకు పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు పోటీపడుతున్నారు. ఈ ప్రసిద్ధ లడ్డూను దక్కించుకున్న వారికి సర్వశుభాలు కలుగుతాయని, సిరిసంపదలు వృద్ధి చెందుతాయనే బలమైన నమ్మకం భక్తుల్లో ఉంది.
ఈ వేలం పాట చరిత్రను తిరగేస్తే అద్భుతమైన ప్రయాణం కనిపిస్తుంది. 1994లో సాధారణంగా కేవలం రూ. 450తో మొదలైన ఈ లడ్డూ వేలం కాలక్రమేణా రూ.50 వేలు, లక్ష దాటుకుంటూ నేడు ముప్పై ఐదు లక్షల స్థాయికి చేరింది. గడిచిన కొన్నేళ్ల వ్యవధిలోనే దీని ధర విపరీతంగా పెరిగింది. 2023లో రూ. 27 లక్షలు పలకగా, 2024 నాటికి అది రూ. 30.01 లక్షల రికార్డును నమోదు చేసింది. ఇక 2025లో నిర్వహించిన పోటీలో లింగాల దశరథ్ గౌడ్ ఏకంగా రూ. 35 లక్షలు బిడ్ చేసి లడ్డూను గెలుచుకున్నారు.
మూడు దశాబ్దాల కిందట వందల రూపాయలతో ప్రారంభమైన ఈ సాంప్రదాయం నేడు రూ. 35 లక్షల రికార్డుకు చేరుకుంది. ప్రతి ఏటా పోటీ తీవ్రమవుతుండటంతో ఈసారి గత ఏటి రికార్డు తుడిచిపెట్టుకుపోతుందా లేదా అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. లడ్డూ వేలం ప్రక్రియ ముగిసిన వెంటనే బాలాపూర్ లంబోదరుడి శోభాయాత్ర నగర పురవీధుల గుండా నిమజ్జనానికి బయలుదేరనుంది.
Also Read : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్
1994 – కొలను మోహన్‌రెడ్డి – రూ.450
1995 – కొలను మోహన్‌రెడ్డి – రూ.4,500
1996 – కొలను కృష్ణారెడ్డి – రూ.18 వేలు
1997 – కొలను కృష్ణారెడ్డి – రూ.28 వేలు
1998 – కొలను మోహన్‌రెడ్డి – రూ.51 వేలు
1999 – కళ్లెం ప్రతాప్‌రెడ్డి – రూ.65 వేలు
2000 – కొలను అంజిరెడ్డి – రూ.66 వేలు
2001 – జి. రఘునందన్‌చారి – రూ.85 వేలు
2002 – కందాడ మాధవరెడ్డి – రూ.1.05 లక్షలు
2003 – చిగిరింత బాల్‌రెడ్డి – రూ.1.55 లక్షలు
2004 – కొలను మోహన్‌రెడ్డి – రూ.2.01 లక్షలు
2005 – ఇబ్రహీం శేఖర్ – రూ.2.08 లక్షలు
2006 – చిగిరింత తిరుపతిరెడ్డి – రూ.3 లక్షలు
2007 – జి. రఘునందన్‌చారి – రూ.4.15 లక్షలు
2008 – కొలను మోహన్‌రెడ్డి – రూ.5.07 లక్షలు
2009 – సరిత – రూ.5.10 లక్షలు
2010 – కొడాలి శ్రీధర్‌బాబు – రూ.5.35 లక్షలు
2011 – కొలను బ్రదర్స్ – రూ.5.45 లక్షలు
2012 – పన్నాల గోవర్ధన్‌రెడ్డి – రూ.7.50 లక్షలు
2013 – తీగల కృష్ణారెడ్డి – రూ.9.26 లక్షలు
2014 – సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి – రూ.9.50 లక్షలు
2015 – కళ్లెం మదన్‌మోహన్‌రెడ్డి – రూ.10.32 లక్షలు
2016 – కందాడి స్కైలాబ్‌రెడ్డి – రూ.14.65 లక్షలు
2017 – నాగం తిరుపతిరెడ్డి – రూ.15.60 లక్షలు
2018 – తేరేటిపల్లి శ్రీనివాస్‌గుప్తా – రూ.16.60 లక్షలు
2019 – కొలను రాంరెడ్డి – రూ.17.60 లక్షలు
2020 – కరోనా కారణంగా సాధారణ వేలం లేదు
2021 – మర్రి శశాంక్‌రెడ్డి, రమేష్‌యాదవ్ – రూ.18.90 లక్షలు
2022 – వంగేటి లక్ష్మారెడ్డి – రూ.24.60 లక్షలు
2023 – దాసరి దయానంద్‌రెడ్డి – రూ.27 లక్షలు
2024 – కొలను శంకర్‌రెడ్డి – రూ.30.01 లక్షలు
2025 – లింగాల దశరథ్‌గౌడ్ – రూ.35 లక్షలు
Also Read : బీజేపీలో కీలక మార్పులు.. తెలుగు రాష్ట్రాలకు కొత్త ఇన్చార్జీలు!









