
Asian Games 2026 : జపాన్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్ తొలి బంగారు పతకాన్ని సాధించింది. ఇటీవల ఆసియా కప్ గెలుచుకుని ఉత్సాహంగా ఉన్న మహిళల క్రికెట్ జట్టు ఆసియా క్రీడల్లోనూ తన ప్రతిభ చాటింది. మహిళల క్రికెట్లో భారత్ గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 147 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం విశేషం. కాగా.. గత వారం క్రీతమే ఆసియా క్రీడల్లోనూ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టునే ఓడించి ఆసియాకప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read : చంద్రుడు మాదే.. ట్రంప్ సంచలన కామెంట్స్.. అమెరికా చట్టం ఏం చెబుతోంది?
Back-to-back 𝗚𝗢𝗟𝗗 𝗠𝗘𝗗𝗔𝗟𝗟𝗜𝗦𝗧𝗦 🏅
Congratulations to #TeamIndia on clinching a 2️⃣nd consecutive Gold Medal in women’s cricket at the #AsianGames 🇮🇳👏
Scorecard ▶️ https://t.co/DVlhLBajxB pic.twitter.com/AAkS0VDUKh
— BCCI Women (@BCCIWomen) September 22, 2026
Also Read : రేపు అమెరికాకు జిన్‌పింగ్… విమానశ్రయానికి ట్రంప్ ?
అదే ఊపుతో ఉన్న హర్మన్ ప్రీత్ సేన అద్భుత విజయంతో పసడిని సొంతం చేసుకుంది ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసి వారి ముందు 217 లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లు కూడా అద్బుతంగా రాణించారు. స్మృతి మంధాన (79; 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) హాఫ్ సెంచరీ దాటించగా. షఫాలీ వర్మ (48; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రిచా ఘోష్ (49 నాటౌట్; 22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తో అత్యంత వేగంగా ఆడి స్కోరు బోర్డును పరుగు పెట్టించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (19; 17 బంతుల్లో 3 ఫోర్లు) కూడా పర్వాలేదనిపించింది. శ్రీలంక బౌలర్లలో సుగంధిక కుమారి, కవిషా దిల్హారి, చాముడి ప్రభోదలు తలా ఓ వికెట్ తీశారు. దీంతో 3 వికెట్ల నష్టానికి భారత్ 216 పరుగులు తీసింది.
అనంతరం శ్రీలంక 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ, 15.4 ఓవర్లలో 69 పరుగులకే జట్టు కుప్పకూలింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు (29; 21 బంతుల్లో 5 ఫోర్లు), కవిష దిల్హరి (11), కౌశాని నుత్యంగన (14) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించ గలిగారు. మిగిలిన వారంతా సింగిల్ రన్లకే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీసింది. షఫాలీ వర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్ లు తలా రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి దోహద పడ్డారు. అంతకుముందు జరిగిన కాంస్య పోరులో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది.









