UK Breakup : ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు 60కిపైగా దేశాలను ఆక్రమించుకుని.. రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలుగొందిన యునైటెడ్ కింగ్‌డమ్‌ నేడు తన ప్రాముఖ్యతను కోల్పోతుంది. ఇప్పటివరకు ఆ దేశంలో భాగమైన పలు దేశాలు ఆ దేశం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాయి. వాటిలో వేల్స్‌ (Wales), స్కాట్‌లాండ్‌ (Scotland), నార్తర్న్ ఐర్లాండ్‌ (Northern Ireland) దేశాల ప్రతినిధులు ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయడం సంచలనంగా మారింది.

ఇప్పుడి దేశాలు విడిపోతే ఇప్పటివరకు మనకు తెలిసిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అనేది ఉండదు. అందరూ సాధారణంగా పిలిచే బ్రిటన్‌, యూకే పేర్లు కొన్ని దేశాల కలయికతో ఏర్పడినవి. ఇంగ్లాండ్‌, స్కాట్‌లాండ్, వేల్స్ కలిసి గ్రేట్‌ బ్రిటన్‌ అని పిలుస్తారు. వీటికి నార్తర్న్ ఐర్లాండ్‌ కూడా కలిసినట్లయితే యునైటెడ్ కింగ్టమ్ (UK). అని అంటారు. ఇప్పుడు ఈ మూడు దేశాలు యూకే నుంచి బయటపడి, పూర్తి స్వయం ప్రతిపత్తిగల దేశాలుగా ఉండాలని భావిస్తున్నాయి. అదే గనక జరిగితే ఆ రాజ్యంలో ఇంగ్లాండ్ మాత్రమే మిగులుతుంది. కాగా తాము విడిపోతున్నామని రాజ్యాంగ మార్పునకు సిద్ధంగా ఉండాలని, తమ భవిష్యత్ ఐరోపా యూనియన్‌తో ముడిపడి ఉందని యూకే ప్రధాని ఆండీ బర్నహామ్‌ ప్రభుత్వానికి ఆ మూడు దేశాల ఫస్ట్‌ మినిస్టర్లు..ఇప్పటికే సమాచారం ఇచ్చారు.

కాగా ఈ ప్రకటన వెలువరించిన వెంటనే యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్‌లలోని ప్రధాన జాతీయవాద పార్టీల నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారు. తమ దేశాలకు స్వయం నిర్ణయాధికారం ఉందని స్పష్టం చేస్తూ ఒక చారిత్రక ఒప్పందంపై సంయుక్తంగా సంతకాలు చేశారు. రాజ్యాంగపరమైన మార్పులకు బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ పరిణామం యూకే రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఫస్ట్‌ మినిస్టర్ల వ్యాఖ్యలపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెంటనే స్పందించింది. ప్రధాని యూకే ఐక్యతనే విశ్వసిస్తున్నారని స్పష్టం చేసింది. రాజ్యాంగపరమైన అంశాల్లో చర్చల కంటే ప్రజల జీవన వ్యయాలను తగ్గించడంపైనే ఆయన ప్రధానంగా దృష్టిసారించారని వివరించింది. గతంతో పోలిస్తే తమ యూనియన్‌కు ముప్పు ఎక్కువగా ఉందని అనుకోవడం లేదని వెల్లడించింది. అయితే యూకే వ్యాప్తంగా రాజకీయ వాతావరణం మారుతోందని, తమ దేశాల భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు తమ ప్రజలకు ఉందని ఈ ఒప్పందం అయా దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు.

‘బ్రేకప్‌’ కారణాలు ఏంటంటే..
కాగా, ఇన్నాళ్లు కలిసి ఉన్న దేశాలు విడిపోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రజలు తమ సంస్కృతులను కాపాడుకునేలా సొంత నిర్ణయాలు తామే తీసుకోవాలని స్కాట్‌లాండ్ (Scotland), వేల్స్‌ (Wales), నార్తర్న్ ఐర్లాండ్ (Northern Ireland) ప్రజలు భావిస్తున్నారు. వెస్ట్‌మినిస్టర్ విధానాలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా లేవని స్పష్టం చేస్తున్నారు.
స్కాట్‌లాండ్ ప్రజలు ఐరోపా యూనియన్‌లోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావడం వారికి నచ్చలేదు. అలాగే తమ ప్రాంతంలోని చమురు సంపదపై నిర్ణయాధికారం తమకే ఉండాలని వారు కోరుకుంటున్నారు.
ఇక నార్తర్న్ ఐర్లాండ్ ప్రజల్లో చాలామంది పక్కనే ఉన్న రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌ దేశంతో కలిసిపోవాలనుకుంటున్నారు. బ్రిటన్ పాలన నుంచి వేరుపడి, గతంలో తమకున్న గుర్తింపును తిరిగి పొందాలని అనుకుంటున్నారు. బ్రెగ్జిట్ కారణంగా వాణిజ్యపరంగా నష్టపోతున్నామని ఆరోపిస్తున్నారు.
వేల్స్.. వీరు తమ చట్టాలను తామే చేసుకోవాలని, తమకంటూ ప్రత్యేకమైన భాష, సంస్కృతిని కాపాడుకోవాలని కోరుకుంటున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.