Trump Backs Down On Steel Tariffs
Trump Backs Down On Steel Tariffs

Trump visa rules : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలో వలసలను నిరోధించడం కోసం తీసుకు వస్తున్న కఠిన ప్రభుత్వ వలస విధానాలు ఆయనకు రివర్స్ అవుతున్నాయి. ముఖ్యంగా న్యాయస్థానాల్లో అవి ఏమాత్రం నిలవడం లేదు. ఇప్పటికే పలు విషయాలపై ట్రంప్ కు మొట్టికాయలు వేసిన కోర్టు తాజాగా ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వీసా నిబంధనలను బోస్టన్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టు నిలిపివేయడం ట్రంప్‌కు ఎదురుదెబ్బగా భావించవచ్చు. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే కాలవ్యవధిపై పరిమితులు విధించేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనల అమలును కోర్టు తాత్కాలికంగా అడ్డుకుంది. ఆ నిబంధనలు అమల్లోకి రావడానికి ఒకరోజు ముందు ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.

కాగా న్యాయస్థానంలో దీనిపై వాదోపవాదాలు జరిగాయి. ఈ కొత్త వీసా నిబంధనల అమలు కోసం హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం చెప్పిన కారణాలు పూర్తిగా సమర్థించేవిగా లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది, యాభై ఏళ్లకుపైగా అమలులో ఉన్న వ్యవస్థను ఒక్కసారిగా మార్చడం సరైన చర్య కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఒకవేళ ఈ నిబంధనలు అమలయితే.. విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలు తగ్గి, అమెరికా ఉన్నత విద్యారంగం, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని కోర్టు హెచ్చరించింది.

కాగా, అమెరికా (USA)లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు గతంలో ఉన్న నాలుగేళ్ల నివాస కాలపరిమితిపై నూతన నిబంధనలను హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం జులైలో విడుదల చేసిన విషయం తెలిసిందే. జే1 వీసాలపై వచ్చే ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు, ఐ-వీసాలపై వచ్చే మీడియా ప్రతినిధులకు నిర్దిష్ట కాలపరిమితిని విధించేలా ఆ ప్రతిపాదనలను హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం రూపొందించింది. అలాగే ఎఫ్‌1 వీసాలపై వచ్చిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంత వరకూ ‘డ్యురేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌’ కింద యూఎస్‌లో ఉండే వెసలుబాటు ఉంది. అయతే ఈ నిబంధనను ఎత్తివేయాలని అమెరికా భావించింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే.. 3 లక్షల మందికిపైగా భారతీయులపై ప్రభావం పడుతుంది. కాగా, కోర్టు తీర్పుతో అన్ని వర్గాలకు తాత్కాలిక ఊరట లభించినట్లయింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.