SIIMA Awards 2026: 2026 సంవత్సరానికిగానూ సైమా అవార్డ్స్‌-2026 (South Indian International Movie Awards 2026) వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ అవార్డుల సంబరానికి దక్షిణాది సినీ తారలు విచ్చేయడంతో సందడి నెలకొంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో ఉత్తమ ప్రతిభ చూపించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డ్స్ అందజేశారు. అయితే తెలుగు నుంచి మిరాయ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు అత్యధిక అవార్డ్స్ గెలుచుకుని సత్తా చాటాయి.

‘తండేల్‌’ చిత్రంలో నటనకు గానూ నాగచైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే ‘మిరాయ్‌’లో నటనకు గానూ యువ కథానాయకుడు తేజ సజ్జా ఉత్తమ నటుడి (క్రిటిక్స్‌) అవార్డును అందుకోవడం విశేషం. ఈ మూవీ వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ అవార్డు అందుకోవడం పట్ల తేజ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఉత్తమ నటి (క్రిటిక్స్‌) అవార్డును ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో నటనకుగానూ ఐశ్వర్య రాజేశ్‌ను ఎంపికచేశారు. ఉత్తమ దర్శకుడిగా అనిల్‌ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ హాస్యనటుడి అవార్డును బుల్లిరాజు అలియాస్‌ భీమల రేవంత్‌ (సంక్రాంతికి వస్తున్నాం) అందుకున్న వారిలో ఉన్నారు. ఇక ‘కాంతార: చాప్టర్‌1’లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించిన కన్నడ నటుడు రిషబ్‌శెట్టి ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నారు.

అవార్డులు అందుకున్న ముఖ్య తారలు

ఉత్తమ నటుడు – నాగచైతన్య (తండేల్‌)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) – తేజ సజ్జా (మిరాయ్‌)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌) – ఐశ్వర్య రాజేశ్‌ (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ దర్శకుడు – అనిల్‌ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌) – చందూ మొండేటి (తండేల్‌)
ఉత్తమ చిత్రం – మిరాయ్‌
ఉత్తమ ప్రతినాయకుడు – మంచు మనోజ్‌ (మిరాయ్‌)
ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – (సంక్రాంతికి వస్తున్నాం)
బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ – వెంకటేశ్‌ (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ సహాయ నటుడు – సత్యదేవ్‌ (కింగ్డమ్‌)
ఉత్తమ సహాయ నటి – శ్రద్ధా శ్రీనాథ్‌ (డాకు మహారాజ్‌)
ఉత్తమ హాస్య నటుడు – బుల్లిరాజు (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ -కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
ఉత్తమ నేపథ్య గాయకుడు -రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ నేపథ్య గాయని -సమీరా భరద్వాజ్‌ (కోర్ట్‌)
ఉత్తమ నటుడు (పరిచయ) – హర్ష్‌ రోషన్‌ (కోర్ట్‌)
ఉత్తమ నటి (పరిచయ) – శ్రీదేవి (కోర్ట్‌)
ఉత్తమ నటి (పరిచయ) -సాక్షి మడోల్కర్ (మోగ్లీ)
ఉత్తమ గేయ రచయిత: పూర్ణా చారి (కోర్ట్‌)

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.